Thursday, October 18
Log In

CURRENT AFFAIRS- 26ప్రశ్నలు-26 JULY

రాష్ట్రీయం

1) రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణల కోసం ఎంత నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.2వేల కోట్లతో
2) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ ఏడాది చివరికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఎంత మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు ?
జ: 800 మెగావాట్లు
3) ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం 2014లో నియమించిన కమిటీ ఏది ?
జ: శ్యాంకుమార్ సిన్హా కమిటీ
4) దేవాదుల ఎత్తిపోతల పథకానికి మరో పేరేంటి ?
జ: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం
5) దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా రామప్ప చెరువులోని నీటిని ఏ చెరువుకు తరలింపునకు సంబంధించిన మూడో ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది ?
జ: ధర్మసాగర్ చెరువులోకి

జాతీయం

6) భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ తో ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: జె.ఎస్. ఖేహర్
7) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ట్విటర్ ఖాతా పేరేంటి ?
జ: @rashtrapati-bhvn
(నోట్: దీని ఫాలోవర్ల సంఖ్య 32.9 లక్షల మంది )
8) గతంలో ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన ట్విటర్ ఖాతా పేరేంటి ?
జ: @POI13
9) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం ఏ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్నారు ?
జ: @CitiznMukherjee
10) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త నివాసం ఎక్కడ ఉంది ?
జ: 10, రాజాజీ మార్గ్
(నోట్: గతంలో ఇక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉండేవారు )
11) రైసనా హిల్స్ క్యాపిటల్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్రపతి భవన్ ను డిజైన్ చేసిన బ్రిటన్ ఆర్కిటెక్టు ఎవరు ?
జ: సర్ ఎడ్విన్ ల్యాండ్ సీర్ లుటెయిన్స్
12) బ్రిటీష్ పాలనలో వైశ్రాయి నివాసంగా నిర్ణయించిన భవనం నిర్మాణం 1929లో పూర్తయింది. అది రాష్ట్రపతి భవన్ గా ఎప్పుడు మారింది ?
జ: 1950లో
13) కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును CJI జస్టిస్ ఖేహర్ సిఫార్సు చేశారు ?
జ: జస్టిస్ దీపక్ మిశ్రా
14) ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త య‌శ్‌పాల్‌ నోయిడాలో కన్నుమూశారు. ఆయన ఏ అధ్యయనంలో ప్రసిద్ధుడు ?
జ: కాస్మిక్ కిరణాలు
15) అరుణాచల్ ప్రదేశ్ లో RIWATCH మ్యూజియంను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కిరెన్ రిజిజు
16) మనదేశంలో మాట్లాడే ప్రతి మాతృభాషను సంరక్షించి దానిని డాక్యుమెంట్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరేంటి ?
జ: స్పీల్ ( అంతరించిపోతున్న భారతీయ భాషల పరిరక్షణ, సంరక్షణ)
17) మాతృభాషను సంరక్షించే స్పీల్ పథకాన్ని ఏ సంస్థ నిర్వహించనుంది ?
జ: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ( CIIL), మైసూర్
18) స్కూళ్ళల్లో వందేమాతరం గీతం తప్పనిసరిగా పాడాలని ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు ఏది ?
జ: మద్రాస్ హైకోర్టు ( తమిళనాడు )
19) భారత్ ఇటీవలే ఏ దేశంతో నదీజలాల ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: బంగ్లాదేశ్
20) దేశంలో నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: జులై 23
(నోట్: రేడియో ప్రసారాలు మొదలైన తేదీ ఇదే. 1927 జులై 23న దేశంలో బొంబే స్టేషన్ నుంచి రేడియో ప్రసారాలు మొదలయ్యాయి )
21) భారత విదేశాంగ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: రావీష్ కుమార్ (1995 IFS బ్యాచ్ అధికారి )
22) 2017 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం గెలుచుకున్న వరుణ్ భాటీ ఏ క్రీడకు చెందిన వారు ?
జ: హై జంప్

అంతర్జాతీయం

23) గూగుల్ CEO సుందర్ పిచాయ్ కు ఆ కంపెనీ మాతృసంస్థ డైరక్టర్ల బోర్డులో చోటు లభించింది. ఆ సంస్థ పేరేంటి ?
జ: ఆల్ఫాబెట్
24) రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఐస్ లాండ్ జలాల్లో మునిగిన నాజీల నాటి నౌకలో 4 టన్నులు (రూ.839కోట్ల విలువైన) బంగారం ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నౌక పేరేంటి ?
జ: మిడెన్ నౌక
25) హ్యాక్ చేయడానికి వీలులేని భారీ క్వాంటమ్ కంప్యూటర్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసిన దేశం ఏది ?
జ: చైనా
26) 2017 ఆసియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి ?
జ: నేపాల్ ( నేపాల్ ఆర్మీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఖాట్మాండూ)