Monday, October 15
Log In

CURRENT AFFAIRS-25ప్రశ్నలు – 29JULY

రాష్ట్రీయం
1)తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను ఎదుర్కొని పండే మన వరి వంగడాన్ని ఇకపై ఘనా దేశంలో కూడా పండించనున్నారు. దాని పేరేంటి ?
జ: తెలంగాణ సోనా
(నోట్: నేషనల్ రీసెర్చ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పోరేషన్ (NRDC) తో ఘనాకి చెందిన గుడ్ ఎర్త్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ ఒప్పందం చేసుకుంటోంది )
2) మహిళల ప్రపంచకప్ క్రికెట్ లో భారత జట్టును ఫైనల్ కు చేర్చిన కెప్టెన్ మిథాలీరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం నజరానా ఇచ్చింది ?
జ: కోటి రూపాయలు


3) మిషన్ భగీరథ పథకానికి (కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పనులకు ) రూ.328 కోట్ల రుణం ఇచ్చిన బ్యాంకు ఏది ?
జ: ఆంధ్రా బ్యాంకు

జాతీయం
4) సామాజిక మాధ్యమాల నుంచి ఖర్చుల సమాచారాన్ని రాబట్టడానికి కేంద్ర సర్కార్ చేపట్టిన ప్రాజెక్ట్ పేరేంటి ?
జ: ప్రాజెక్ట్ ఇన్‌సైట్‌


5) కొత్తగా ఏర్పడిన ఐలాండ్స్ డెవ‌ల‌ప్‌మెంట్‌  ఏజెన్సీ (IDA) కి ఏ కేంద్ర మంత్రి అధ్యక్షత వహిస్తున్నారు ?
జ: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్
6) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ స్మారకాన్ని రూపుదిద్దింది ఎవరు ?
జ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఆర్గనైజేషన్ (DRDO)
7) చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయిన భారత భద్రతా సలహాదారు (NSA) పేరేంటి ?
జ: అజిత్ డోభాల్
8) వరకట్న వేధింపులకు సంబంధించి ఏ చట్టం దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ?
జ: భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 498 ఏ
9) రోజ్ వ్యాలీ కుంభకోణం ఏ రాష్ట్రంలో జరిగింది ?
జ: పశ్చిమ బెంగాల్
10) 52 యేళ్ళ తర్వాత బెంగాల్ టైగర్ అడుగు జాడలు ఏపీలోని ఏ అడవుల్లో కనిపించాయి ?
జ: శేషాచలం అడవుల్లో
11) భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చూరీ ఎక్కడ ఉంది ?
జ: కర్ణాటక
12) విమానయాన రంగంలో మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది ?
జ: ఉత్తరాఖండ్
13) ఆసియా అభివృద్ధి బ్యాంకులోని గవర్నర్ల బోర్డులో భారత్ తరపున అల్టర్నేట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుభాష్ చంద్ర గార్గ్


14) ఇటీవల మరణించిన ధరమ్ సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ?
జ: కర్ణాటక
15) డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: విశాఖపట్నం
16) నేషనల్ ఎర్త్ సిస్టమ్ సైసెన్స్ (NESS) ఎవరికి 2017 లైఫ్ టైమ్ ఎక్సెలెన్స్ అవార్డును ప్రకటించింది ?
జ: కె.గోపాలన్
17) 2017 మహానాయక్ సమ్మాన్ అవార్డు అందుకున్నది ఎవరు ?
జ: శకుంతల బరువా ( అలనాటి నటి )
18) ఫకిమ్ వైల్డ్ లైఫ్ శాంక్చూరీ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: నాగాలాండ్
19) ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కు ఎన్నికైన ద్యుతీ చంద్ ఏ క్రీడకు చెందిన వారు ?
జ: స్ర్పింట్ అథ్లెట్

అంతర్జాతీయం
20) అవినీతి కేసులో రాజీనామా చేసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఏ స్కామ్ లో ఆరోపణలు వచ్చాయి ?
జ: పనామా పత్రాలు
21) నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడు అవడానికి కారణమైన పనామా పత్రాలను ఏ సంస్థ లీక్ చేసింది ?
జ: ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ICIJ)
22) పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరేంటి ?
జ: తెహ్‌రీక్ ఇ ఇన్‌సాఫ్‌
23) 2017 బ్రిక్స్ యూత్ ఫోరమ్ ను నిర్వహించిన దేశం ఏది ?
జ: చైనా
24) IMF, ప్రపంచ బ్యాంకుల నుంచి స్వాంతంత్ర్యం పొందినట్టు ఇటీవల ప్రకటించిన దేశం ఏది ?
జ: బొలీవియా
25) Middle East North Africa and South Asia (MENASA) రీజియన్ కు డేటా హబ్ ను ఏ సిటీలో ఏర్పాటు చేయాలని ఐక్య రాజ్యసమితి నిర్ణయించింది ?
జ: దుబాయ్