Friday, May 25
Log In

CURRENT AFFAIRS – 25AUG

రాష్ట్రీయం
1) మహిళలు, యువత సాధికారత కోసం కృషి చేసినందుకు నిజామాబాద్ ఎంపీ కవితకు ఏ పురస్కారం లభించింది ?
జ: నారీ ప్రతిభా పురస్కారం
2) అవగాహనతో కేన్సర్ ని దూరం చేయొచ్చని నిరూపిస్తూ ‘‘ఐ యామ్ ఎ సర్వైవర్ పుస్తకం’’ రాసినది ఎవరు ?
జ: ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి

జాతీయం
3) వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనంలో ఎంత మంది న్యాయమూర్తులు ఉన్నారు ?
జ: తొమ్మిది మంది
4) జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్చ అనుభవించే హక్కులను ప్రసాదించే ఏ ఆర్టికల్ నుంచే వ్యక్తిగత గోప్యత హక్కు కూడా సంక్రమించిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?
జ: ఆర్టికల్ 21
5) వ్యక్తిగత గోప్యత హక్కుకు రాజ్యాంగ పరమైన రక్షణ లేదని గతంలో ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది ?
జ: 1950లో ఎం.పి.శర్మ కేసు, రెండో తీర్పు 1960లో ఖరక్ సింగ్ కేసు
6) సమాచార భద్రతకి ప్రస్తుతం సమగ్ర చట్టం ఏదీ లేదు. అయితే ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ మాత్రమే భద్రత కల్పిస్తోంది ?
జ: సెక్షన్ 43(ఏ)
7) డిజిటల్ యుగంలో సమాచార పరిరక్షణకు చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
జ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ
8) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI) CEO ఎవరు ?
జ: అజయ్ భూషణ్ పాండే
9) ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన రూ.200నోటులో ఏ చిహ్నాన్ని ముద్రించారు ?
జ: సాంచీ స్థూపం
10)గోవాకి చేరుకున్న అమెరికాకు చెందిన ఉభయచర యుద్ధ నౌక ఏది ?
జ: USS పెరల్ హార్బర్
11) ఇన్ఫోసిస్ ఛైర్మన్ గా ఎవర్ని నియమిస్తూ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది ?
జ: నందన్ నీలేకని
12) UPA హయాంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI-ఆధార్) కు రూపం ఇచ్చిన వారు ఎవరు ?
జ: నందన్ నీలేకనీ

 (28 నుంచి కొత్త బ్యాచ్)

అంతర్జాతీయం
13) మొట్టమొదటి కోల్ Shipment ను అమెరికా ఏ దేశానికి పంపుతోంది ?
జ: ఉక్రెయిన్
14) ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన వేనీ రూనీ ఏ క్రీడకు చెందినవారు ఎవరు ?
జ: ఫుట్ బాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *