Monday, September 24
Log In

CURRENT AFFAIRS – 21 ప్రశ్నలు – 20AUG

రాష్ట్రీయం

1) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏ అవార్డు లభించింది ?

జ: ఆహార వ్యవసాయ మండలి నాయకత్వ పురస్కారం

2) న్యుకాన్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన అంతరిక్ష, రక్షణ రంగ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

జ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్టలోని నాదర్ గుల్ పారిశ్రామిక పార్కులో

3) ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేధింపులు, గృహహింస, ఈవ్ టీజర్ల నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ లైన్ నెంబర్ ఎంత ?

జ: 181

4) కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం అజీవిక గ్రామీణ్ ఎక్స్‌ప్రెస్‌ యోజన పథకం కింద తెలంగాణలోని బడుగు మహిళలకు 30 వాహనాలను మంజూరు చేసింది.  అయితే ఈ పథకం ఏ పథకంలో భాగం?

జ: దీనదయాళ్ అంత్యోదయ యోజన

(current affairs prepared by telanganaexams.com )

NATIONAL

5) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) లో కొత్తగా చేరిన పార్టీ ఏది ?

జ: జనతాదళ్ ( యు )

6) కొత్త 50 రూపాయల నోటు మీద ఏ లెటర్ సిరీస్ ను ఆర్బీఐ  ముద్రించనుంది ?

జ: ఏమీ లేదు

7) అమెరికా నుంచి భారత్ సైన్యం కొనుగోలు చేయబోతున్న 6 అపాచీ హెలికాప్టర్లకు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ?

జ: Defence acquisition council (India)

8) ఇండియన్ కోస్ట్ గార్డ్ ల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది ?

జ: 32 వేల కోట్లు

9) దీపావళి సంబురాల్లో శబ్ద, వాయు కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది ?

జ: హిరత్ దివాలీ, స్వస్థ్ దివాలీ

10) దేశంలోనే మొదటి ప్రపంచ శాంతి విశ్వవిద్యాలయంను మహారాష్ట్రలోని పుణేలో ప్రారంభించారు. దాని పేరేంటి ?

జ: Dr. Viswanath Karad MIT World Peace University

11) ఏ స్కీమ్ కింద తీసుకునే రుణాలకు 12 నెలసరి వాయిదాల మాఫీ చేయాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది ?

జ: శుభ్ ఆరంభ్

12) ఫిక్కీ హెల్త్ కేర్ పర్సనాలిటీ అవార్డు ఎవరికి దక్కింది ?

జ: డాక్టర్ నంద కుమార్ జైరామ్

13) BSNL ఏ సంస్థతో కలసి Bespoke mobile wallet ను ప్రారంభించింది ?

జ: MobiKwik

14) వాతావరణంలో అనూహ్యమైన మార్పులతో (క్లైమేట్ ఛేంజ్ ) దేశం ఎంత మొత్తాన్ని భరించాల్సి వస్తోంది ?

జ: $10 బిలియన్లు ( దాదాపు రూ.67 వేల కోట్లు)

(current affairs prepared by telanganaexams.com )

INTERNATIONAL

15) ఈనెల 21న 99యేళ్ల తర్వాత ఏ దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది?

జ: అమెరికా

16) ఫార్ట్యూన్ 2017 ప్రకటించిన ప్రపంచంలోని 40మంది40యేళ్ళలోపు ప్రభావవంతమైన వ్యక్తలు జాబితాలో మొదట నిలిచింది ఎవరు ?

జ: Emmanuel Macron

17) ఆసియా పసిఫిక్ రీజియన్ లో బలం పెంచుకోడానికి మూడు దేశాలతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అమెరికా, జపాన్ నిర్ణయించాయి.  భారత్ కాకుండా మరో రెండు దేశాలు ఏవి ?

జ: దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా

18) ఖతార్ పై నిషేధం విధించినా హజ్ యాత్రికుల కోసం ఏ మార్గాన్ని తెరవాలని సౌదీ అరేబియా నిర్ణయించింది ?

జ: సల్వా బోర్డర్

19) ఖతార్ దేశం ఇటీవలే పాకిస్తాన్ కి కొత్త జలమార్గాన్ని తెరవాలని నిర్ణయించింది. ఇది ఏయే పోర్టులను కలుపుతుంది ?

జ: హమద్ పోర్ట్ , కరాచీ పోర్ట్

20) పాకిస్తాన్ కు చెందిన సాహస బాలిక మలాలా యూసప్ జాయ్ ఏ యూనివర్సిటీలో చదవనుంది ?

జ: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో

21) హ్యాండీకాప్ ఇంటర్నేషనల్ కి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులైన బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు ఎవరు ?

జ: నేమర్

(current affairs prepared by telanganaexams.com )