Monday, September 24
Log In

CURRENT AFFAIRS- 16ప్రశ్నలు-15AUG

రాష్ట్రీయం
1) పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఏషియా ఇంటర్నేషనల్ ఎవరు ?
జ: రష్మిఠాకూర్
2) తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తయిన ఏ శిఖరాన్ని అధిరోహించారు ?
జ: కిలిమంజారో
(నోట్: వీళ్లంతా గిరిజన, బీసీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్. 100 అడుగుల జాతీయ పతాకం ఎగురవేశారు )
3) స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు 10 వేల మంది తాపీ మేస్ట్రీలకు ఎవరి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు ?
జ: నేషల్ అకాడమీ ఆఫ్ క‌న్‌స్ట్రక్షన్ (న్యాక్)
4) రాష్ట్రంలో చేపల పెంపకానికి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన 100 కేజ్ కల్చర్ సెంటర్ల ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది ?
జ: జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ( NFDB)
5) నవంబర్ లో హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొంటాయి ?
జ: 170 దేశాలు

జాతీయం
6) 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎంతమందికి శౌర్య పతకాలను ప్రకటించారు ?
జ: 112 పతకాలు
7) ఈసారి కీర్తి చక్ర అవార్డులను ఎంతమందికి ప్రదానం చేయనున్నారు ?
జ: ఐదుగురికి                                                                                                                  8) 2022 కల్లా నవభారతాన్ని నిర్మిద్దామన్న లక్ష్యంతో పంద్రాగస్టు నాడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: సంకల్ప పర్వం
9) జమ్మూకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఏ ఆర్టికల్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది ?
జ: 35 ఏ
(నోట్: 1954లో రాష్ట్రపతి ఉత్తర్వులతో ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు )
10) జులైలో టోకు ద్రవ్యోల్భణం ఎంత శాతంగా నమోదైంది ?
జ: 1.88 శాతం
11) 2017 మాలతీ చందూర్ పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి
12) టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబోయే కార్యక్రమం పేరేంటి ?
జ: మనగుడి

13) కేంద్ర పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఏ పోర్టల్ ను ఉపయోగిస్తున్నట్టు ఇస్రో వెల్లడించింది ?
జ: భువన్

అంతర్జాతీయం
14) ఒక సూపర్ కంప్యూటర్ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS)నకు పంపాలని స్పేస్ ఎక్స్ నిర్ణయించింది.  ఈ కంప్యూటర్ ఏ కంపెనీ తయారు చేసింది ?
జ: HP కంపెనీ
15) ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో ఉత్తరకొరియాకి దిగుమతులను నిలిపేసిన దేశం ఏది ?
జ: చైనా
16) ఏ దేశంలో కలరా వ్యాధి విజృంభిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది ?
జ: యెమన్