Monday, November 18

CURRENT AFFAIRS – FEB 14 & 15

తెలంగాణ
01) పట్టణాల్లో నల్లా కనెక్షన్ పొందేందుకు చెల్లించాల్సిన ధరావత్తు సొమ్మును ఎంత మొత్తానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.100కి
02) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎంతమంది రైతులను అర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ?
జ: 24 లక్షల మంది
03) సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ( SCSC) ఆధ్వర్యంలో HICC లో జరిగిన ఉమెన్ కాంక్లేవ్ - 2019 ను ఎవరు ప్రారంభించారు ?
జ: గవర్నర్ ఈసీఎల్ నరసింహన్
04) రాష్ట్రంలో ఎక్కడ పశు వీర్య ఉత్పత్తి ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు రూ.47.5 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ?
జ: కరీంనగర్ లోని ఘనీకృత వీర్యనాళికల ఉత్పత్తి కేంద్రం ఆవరణలో
05) పరిశోధనలు చేసి వాటికి పేటెంట్స్ పొందేందుకు విద్యార్థులు, అధ్యాపకులకు సాయం చేసేందుకు CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) తో JNTU ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం ఏ పేరుతో వేదికను ఏర్పాటు చేయనున్నారు ?
జ: జె - హబ్

జాతీయం
06) 49మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి జమ్ము కశ్మీర్ లో ఎక్కడ జరిగింది ?
జ: పుల్వామా జిల్లా అవంతిపుర
07) పుల్వామా దాడికి తామే బాధ్యులమని జైష్ ఎ మహ్మద్ ( JEM) ను 200 జనవరి 31న కరాచీలో ఏర్పాటు చేసింది ఎవరు?
జ: మౌలానా మసూద్ ఆజర్
08) కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ?
జ: సుశీల్ చంద్ర
(నోట్: గతంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఛైర్మన్ గా పనిచేస్తున్నారు )
09) ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని కాందహార్ లో హైజాక్ చేయడం ద్వారా ప్రపంచ ఉగ్రవాది మౌలానా మసూద్ ఆజర్ ను ఎప్పుడు విడుదల చేశారు ?
జ: 1999 డిసెంబర్ 31న
10) పార్లమెంటుపై దాడికి జైష్ ఎ మహ్మద్ సంస్థ ఎప్పుడు పాల్పడింది ?
జ: 2001 డిసెంబర్ 13న
11) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలవుతోంది ?
జ: 2019 ఫిబ్రవరి 24 నుంచి
12) రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం చేసే పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించనున్నారు ?
జ: గోరఖ్ పూర్ (యూపీ) (కిసాన్ మహా అధివేశన్ (రైతు సదస్సులో)
13) విమాన ప్రయాణీకుల వృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో స్థానంలో నిలిచాయి ?
జ: తెలంగాణ - 6, ఏపీ - 13
14) విమాన ప్రయాణీకుల రాకపోకల్లో 2018లో దేశంలో నెంబర్ 1 గా నిలిచిన విమానాశ్రయం ఏది
జ: ఢిల్లీ (5.19 కోట్లు), మహారాష్ట్ర ( 2వ స్థానం - 4.77కోట్లు)
15) ఎయిరిండియా ఛైర్మన్ అండ్ సీఎండీగా ఎవర్ని మళ్లీ నియమించారు ?
జ: అశ్వనీ లోహానీ
16) ప్రభుత్వ రంగ హెలీకాప్టర్ల తయారీ సంస్థ పవన్ హాన్స్ సీఎండీగా ఎవరు మళ్లీ నియమితులయ్యారు ?
జ: బీపీ శర్మ ( 2015 మార్చిలో ఈ పదవి చేపట్టారు)
17) ఎయిర్ ఇండియా సీఎండీ, పవన్ హాన్స్ సీఎండీగా అధికారులను ఎవరిని నియమిస్తారు ?
జ: కేంద్ర మంత్రిమండలికి చెందిన నియామకాల కమిటీ
18) కార్యాలయాల అద్దె పెరుగుదలలో ప్రపంచంలో మూడో స్థానం దక్కించుకున్న భారతీయ నగరం ఏది ?
జ: బెంగళూరు
(నోట్: 2018 లో చదరపు అడుగుకు అద్దె రూ.125రూ. 2019ఆఖరుకు మరో 6.6శాతం పెరగొచ్చని స్థిరాస్థి కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తెలిపింది )
19) జాతీయ స్తాయిలో రోజువారీ వేతనం ఎంతగా ఉండాలని కేంద్ర కార్మిక శాఖ నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది ?
జ: రూ.375 (నెలకు రూ.9750)
20) వేణుగోపాల్ రచించిన జయహో కేసీఆర్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు ?
జ: హోంశాఖ మంత్రి మహమూద్ అలీ

అంతర్జాతీయం
21) అంగారక గ్రహంపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 15 యేళ్ళ క్రితం పంపించిన ఏ రోవర్ కథ ముగిసింది ?
జ: ఆపర్చ్యునిటీ రోవర్
22) 15యేళ్ళ క్రితం అంగారుకుడిపైకి పంపిన ఆపర్చ్యునిటీ రోవర్ మొత్తం ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ?
జ: 45 కిలోమీటర్లు