భారత స్వాతంత్ర్యానికి ముందు చట్టాలు

1) ఆగస్టు ప్రతిపాదనలు, 1940 ను ఎవరు రూపొందించారు ?
జ: లార్డ్ లిన్ లిత్ గో
2) 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్ కు అధినివేశ ప్రతిపత్తి (dominion status)తో పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తామని ఏ ప్రతిపాదనల్లో చెప్పారు ?
జ: ఆగస్టు ప్రతిపాదన
3) క్రిప్స్ రాయబారం కోసం భారతదేశానికి ఎప్పుడు వచ్చారు ?
జ: 1942 మార్చి 22న
4) రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాలు పాల్గొంటేనే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని ఎవరు ప్రకటించారు ?
జ: క్రిప్స్
5) క్రిప్స్ రాయబారం చెల్లని చెక్కులాంటిదని ఎవరు వర్ణించారు ?
జ: మహాత్మా గాంధీ
6) సీఆర్ ఫార్ములాను ఎవరు రూపొందించారు ?
జ: 1944లో సీ.రాజగోపాల చారి
7) భారత్ స్వాతంత్ర్యానికి ముస్లింలీగ్ ఆమోదం తెలపాలి. అలాగే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగం పంచుకోవాలి అని ఏ ఫార్ములా పేర్కొంది ?
జ: సీఆర్ ఫార్ములా
8) దేశ విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది. విభజన ప్రకారం వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. భారత్ లో ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. అని ఏ ఫార్ములా పేర్కొంది ?
జ: సీఆర్ ఫార్ములా
9) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: లార్డ్ క్లమెట్ అట్లీ
10) ముగ్గురు మంత్రులతో ఓ రాయబార కమిటీని భారత్ కు పంపారు (కేబినెట్ రాయబారం (1946). వీటిలో సభ్యులు ఎవరు ?
జ: 1) పెథిక్ లారెన్స్ (ఛైర్మన్) తో పాటు 2) స్టాఫర్డ్ క్రిప్స్ 3) ఎవీ అలగ్జాండర్
11) కేబినెట్ రాయబారం ఎప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడించింది ?
జ: 1946 మే 16న
12) ప్రత్యేక రాజ్యాంగం రూపొందించుకుంటే స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నది ఎవరు ?
జ: కేబినెట్ రాయబారం
13) పాకిస్తాన్ అంటూ మరో దేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పినది ఎవరు ?
జ: 1) పెథిక్ లారెన్స్ (ఛైర్మన్) తో పాటు 2) స్టాఫర్డ్ క్రిప్స్ 3) ఎవీ అలగ్జాండర్ తో కూడిన కేబినెట్ రాయబారం
14) రాజ్యాంగ రూపకల్పన కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతుందని చెప్పినది ఎవరు?
జ: కేబినెట్ రాయబారం
15) భారత గవర్నర్ జనరల్ గా నియమితులైన మౌంట్ బాటన్ ఓ ప్రణాళికను రూపొందించారు. దాన్ని ఏమంటారు ?
జ: మౌంట్ బాటెన్ ప్రణాళిక (1947)
16) 1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ అని రెండు దేశాలుగా విభజించబడతాయని చెప్పినది ఎవరు ?
జ: మౌంట్ బాటెన్ ప్రణాళిక (1947)
17) భారత వ్యవహారాలు, నియంత్రణ కోసం రూపొందించిన ఆఖరి చట్టం ఏది ?
జ: 1947- భారత స్వాతంత్ర్య చట్టం
18) 1947- భారత స్వాతంత్ర్య చట్టాన్ని 1947 జులై 4న బ్రిటీష్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ టైమ్ లో బ్రిటీష్ ప్రధాని ఎవరు ?
జ: క్లెమెట్ అట్లీ
19) 1947 భారత స్వాతంత్ర్య చట్టానికి ఎప్పుడు ఆమోదం లభించింది ?
జ: జులై 15న ఆమోదం లభించింది
20) 1947 భారత స్వాతంత్ర్య చట్టానికి జులై 18న ఎవరు ఆమోదముద్ర వేశారు ?
జ: బ్రిటీష్ రాణి
21) 1947 భారత స్వాతంత్ర్య చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 1947 ఆగస్టు 14 అర్థరాత్రి నుంచి