Monday, September 23

BC గురుకులాల్లో 139 జూనియర్ అసిస్టెంట్స్

రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న 139 పోస్టులను భర్తీ చేసేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. 2017-18 విద్యా సంవత్సరంలో MJPT WCWREIS లో 119 స్కూల్స్ తో పాటు గతంలో ఖాళీగా ఉన్న మరో 20 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు మంజూరు అయ్యాయి. జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ తర్వాత మిగతా పోస్టులకు కూడా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయి.

అర్హత ఏమి ఉండొచ్చు ?

జూనియర్ అసిస్టెంట్స్ కి డిగ్రీ అర్హత ఉంటుంది. ఇందులో టైపిస్టులు కూడా కలిపి ఉంటే మాత్రం టైప్ రైటింగ్ అర్హతతో పాటు కంప్యూటర్ పై అనుభవాన్ని అడిగే అవకాశముంది.

ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు ?

నోటిఫికేషన్ వారం లోగా రిలీజ్ అయితే చివరి తేదీ సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారం వరకూ చివరి తేదీ ఉంటుంది. అప్పటి నుంచి 45 రోజులు ఎగ్జామ్ కి టైమ్ ఉంటుంది. అంటే నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది

Read Also : గురుకుల పోస్టుల నోటిఫికేషన్ వివరాలు

ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ని పేపర్లు ఉండొచ్చు ?

రెండు పేపర్లు ఉండే అవకాశం ఉంది.

1) జనరల్ స్టడీస్ (150 మార్కులు)

2) సెక్రటరియేట్ ఎబిలిటీస్ (150 మార్కులు)

సిలబస్ ఏమి ఉండొచ్చు ?

నోటిఫికేషన్ వచ్చాకే సిలబస్ విషయంలో స్పష్టత రానుంది. అయితే జూనియర్ అస్టిస్టెంట్స్ పోస్టులు గ్రూప్4 కేడర్ కిందకి వస్తాయి. అందువల్ల TSPSC prescribed syllabus ప్రకారం ఈ కింది 11 అంశాలపై ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది.

PAPER-1 : GENERAL STUDIES:

1) Current Affairs
2) International Relations and Events
3) General Science in everday life
4) Environmental Issues and Disaster Management
5) Geography and Economy of India and Telangana
6) Indian Constitution : Salient Features
7) Indian Political System and Government
8) Modern Indian History with a focus on Indian National Movement
9) History of Telangana and Telangana Movement
10) Society, Culture, Heritage, Arts and Literature of Telangana
11) Policies of Telangana State

PAPER -2 : SECRETARIAL ABILITIES

1) Mental Ability (Verbal and Non-verbal)
2) Logical Reasoning
3) Comprehension
4) Re-arrangement of Sentences with a view to improving analysis of a passage
5) Numerical and Arithmetical Abilities

నియామకం ఎలా ఉంటుంది ?

ఈ పోస్టులు జిల్లా స్థాయిలో ఉంటాయి.  అందువల్ల అన్ని జిల్లాల్లోని పోస్టులకు గురుకుల బోర్డు పరీక్ష నిర్వహిస్తుంది.  కానీ నియామక బాధ్యతలను మాత్రం ఆయా జిల్లాల కలెక్టర్లు చూసుకుంటారు.  ఫలితాల తర్వాత మెరిట్, రోస్టర్ పాయింట్స్ ఆధఆరంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  జిల్లా కలెక్టర్లు ధృవీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి పోస్టింగ్స్ ఇస్తారు.  ఈ మొత్తం ప్రక్రియకు 6 నెలల టైమ్ పడుతుంది బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

( బీసీ గురుకులాల్లో జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, సిలబస్ , ఎన్ని పేపర్లు ఉంటాయన్నది... నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే తెలుస్తుంది... మీరు ముందుగా ప్రిపేర్ అవుతారన్న ఉద్దేశ్యంతో మాత్రమే tspsc నమూనా సిలబస్ ఇచ్చాం. గమనించగలరు.  నోటిఫికేషన్ వెలువడ్డాక... ఫైనల్ గా మళ్లీ సిలబస్ వివరాలు అందిస్తాం )

ఫ్రెండ్స్

విద్యుత్ శాఖతో పాటు బీసీ గురుకులాల్లో కూడా జూనియర్ అసిస్టెంట్స్ కి నోటిఫికేషన్లు పడుతున్నాయి.  అందువల్ల మీరు రెండింటికీ కలిపి ప్రిపేర్ అవ్వండి.  ఈ రెండు నోటిఫికేషన్లు పడ్డాక ... జాయింట్ ప్రిపరేషన్ ప్లాన్ నేను వీడియో ఇస్తాను. మీరు మాత్రం ముందుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టండి.  అలాగే గతంలో మెటీరియల్ ఉంటే ఓకే.  ఎవరైనా ఇప్పుడే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే... మా దగ్గర మెటీరియల్ ఉంది.  కావాల్సిన వారు 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి. ఈ రెండు నోటిఫికేషన్లలోని జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు మేం మాక్ ఎగ్జామ్స్ తయారు చేస్తున్నాం.  త్వరలోనే ఆ వివరాలు మీకు ఇస్తాం.

(విష్ణుకుమార్ ఎం, సీనియర్ జర్నలిస్ట్ & కంటెంట్ రైటర్ )