Sunday, August 19
Log In

500మందికి సివిల్స్ లో శిక్షణ

రాష్ట్రంలో 500 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు సివిల్స్ ఎంట్రన్స్ లో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. నిరుద్యోగులు ఈనెల 30 నుంచి ఆగస్టు 12 వరకూ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెంది, సివిల్స్ శిక్షణకు అర్హులైన వారు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. ఆగస్టులో ముందుగా ఎంట్రన్స్ నిర్వహించి 500మందిని ఎంపిక చేస్తారు. వీరికి హైదరాబాద్, వరంగల్ లో శిక్షణ ఉంటుంది. అయితే ట్రైనింగ్ మొదలైన 2 నెలల తర్వాత మరోసారి టెస్ట్ నిర్వహించి అందులో టాలెంట్ చూపించిన 100మందికి సివిల్స్ ప్రిలిమ్స్ తో పాటు, మెయిన్స్ లో శిక్షణ ఇస్తారు. వారికి స్టయిఫండ్ కూడా ఇస్తారు. మిగిలిన 400 మందికి సివిల్స్ ప్రిలిమ్స్ ట్రైనింగ్ కొనసాగిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://tsbcstudycircles.cgg.gov.in