Thursday, July 19
Log In

Author: VishnuM72

జికా వైరస్

International Issues
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మొదట బ్రెజిల్ ప్రారంభమైన ఈ వ్యాధి అమెరికాకు తర్వాత యూరప్ లకు వ్యాపించింది. అడెస్ అజెప్టి దోమ వల్లే జికా వైరస్ సోకుతుంది. డెంగీ, చికున్ గున్యాకి కూడా ఇదే కారణం. 1947లో ఉగండా లో దీన్ని కనుగొన్నారు. 2015లో బ్రెజిల్ లో ప్రారంభమైన జికా వైరస్ గర్బిణీలకు సోకింది. దాంతో పుట్టిన 4 వేల మంది పిల్లలు బుల్లి తల, పెద్ద శరీరంతో పుట్టారు. వీరిలో 49 మంది చనిపోయారు. 2018 వరకూ గర్భం దాల్చవద్దని ఎల్ సాల్విడార్ సర్కార్ తన దేశ మహిళలకు సూచించింది. మరోవైపు జికా వైరస్ కు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ టీకాను అభివృద్ధి చేస్తోంది.

స్టార్టప్ లకు కేంద్రం ప్రోత్సాహం

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
భారతదేశంలో స్టార్టప్ (అంకుర) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10వేల కోట్ల మూలనిధిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత జీవిత బీమా సంస్థ (LIC) దీనికి సహ పెట్టుబడి దారు. స్టార్టప్ పరిశ్రమలకు 3యేళ్ళ పాటు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేస్తారు. మొదటి విడతగా రూ.2,500 కోట్ల మూలనిధిని ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో స్టార్టప్ లకు మూడో కేంద్రంగా భారత్ నిలిచింది. అమెరికా, బ్రిటన్ తర్వాత ఇక్కడే స్టార్టప్ లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి.

పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి

National Issues
2016 జనవరి 2 న ఉదయం 3.30 గంటలప్పుడు పఠాన్ కోట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు భారత సైనికులు చనిపోయారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సభ్యుడు, లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, షూటింగ్ మెడలిస్ట్ సుబేదార్ ఫతే సింగ్ ఉన్నారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు.

PSLV C-31 ప్రయోగం

National Issues
ఇప్పటిదాకా విదేశీ దిక్సూచీ వ్యవస్థనే నమ్ముకున్న మన దేశం... ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా నావిగేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేసుకుంటోంది. ఆ కల నెరవేర్చుకునేందుకు IRNSS-1Eని ఇస్రో శాస్త్రవేత్తలు 2016 జనవరి 20 న ఏపీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి రీజినల్ నేవిగేషన్ సిస్టమ్ - IRNSSను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. దీని జీవిత కాలం 12యేళ్ళు. ఈ ఉపగ్రహం ద్వారా భూమి, ఆకాశం, సాగరాల్లో దిక్సూచీ వ్యవస్థను చూపెడుతుంది. వాహనాల గమనాన్ని సూచించడంతో పాటు భద్రతా బలగాలకు కూడా సేవలు అందిస్తుంది. అమెరికా నేవిగేషన్ వ్యవస్థ - గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) రష్యా - గ్లోబల్ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ( GLONASS) యూరప్ - గెలీలియో చైనా - బీదౌ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ జపాన్ - క్యాసీ జెనిత్ ఉపగ్రహ వ్యవస్థ (QZSS)

హైడ్రోజన్ బాంబు ప్రయోగం

International Issues
అణుబాంబు కన్నా శక్తివంతమైనది హైడ్రోజన్ బాంబు. దీని ప్రయోగం 2016 జనవరి6న విజయవంతంగా నిర్వహించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అణుబాంబు అణు విచ్ఛిత్తి ద్వారా నిర్మితమైతే, హైడ్రోజన్ బాంబు అణు సంలీనం (ఫ్యూజన్) ఆధారంగా తయారవుతుంది. ఇది అనేక వందల రెట్లు శక్తి ఎక్కువ. హైడ్రోజన్ బాంబు ప్రయోగాన్ని అమెరికా సహా అన్ని దేశాలు ఖండించాయి. ఇంతకుముందు 1952లో హైడ్రోజన్ బాంబును అమెరికా ప్రయోగించింది. ఆ పరీక్షకు పసిఫిక్ మహాసముద్రంలోని ఓ ద్వీపం తుడిచిపెట్టుకుపోయింది. 1953లో సోవియట్ యూనియన్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. 1961లో మళ్లీ రష్యా జార్ బాంబా అనే హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. ఇందులో 57 మెగా టన్నుల శక్తి విడుదల అయింది.

1. జీవశాస్త్రం

జీవ శాస్త్రం
1) జీవశాస్త్రానికి బయాలజీ పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? జ: జీన్ లామార్క్ ( ఫ్రెంచ్ శాస్త్రవేత్త )(1809). 2) బయాలజీ అనేది ఏ పదం ? దాని అర్దం ఏంటి? జ: బయాలజీ అనేది గ్రీకు పదం. బయో అంటే జీవం, లోగోస్ అనగా శాస్త్రం 3) జీవ శాస్త్ర పితా మహుడు, వృక్షశాస్త్ర పితా మహుడు ఎవరు? జ.అరిస్టాటిల్ (జీవశాస్త్రం), థియో ఫ్రాస్టస్ ( వృక్షశాస్త్రం) 4) సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జ: లూయి పాశ్చర్ 5) టాక్సానమీ అంటే ఏంటి ? ఈ పదాన్ని సూచించింది ఎవరు ? జ: జీవుల పోలికలను బట్టి గుర్తించడం, దానికి పేరు పెట్టడం, వర్గీకరించడాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ పదాన్ని సూచించింది APD కండోల్ (ఫ్రెంచ్ శాస్త్రవేత్త). 6) జీవులను వర్గీకరించాలన్న ప్రతిపాదనను మొదట తెచ్చింది ఎవరు ? జ: అరిస్టాటిల్ 7) అరిస్టాటిల్ రాసిన గ్రంథమేది ? అందులో జంతువులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ? జ: హిస్టోరియా యానిమాలియమ్. ఈ గ్రంథంల

ఇండియన్ సివిల్ సర్వీసెస్

Civil Service Exams, Civil Services
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రభుత్వ పథకాల్లో కీలకపాత్ర వహించడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఉన్న వారు సివిల్ సర్వీసెస్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు. దేశ స్థాయిలో అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతి యేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. యేటా దాదాపు 10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ప్రిలిమ్స్ పూర్తవగానే మెయిన్స్ కోసం మొత్తం ఉన్న ఉద్యోగాల సంఖ్యకు 1:10 మందిని పిలుస్తారు. ఇది పూర్తయ్యాక ఇంటర్య్యూకి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపికచేస్తారు. అర్హతలు: 1) భారతీయ పౌరుడై ఉండాలి. 2) కేంద్రం, రాష్ట్ర లేదా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివిన వారు కూడా సివిల

నిజాం సబ్జెక్ట్ లీగ్

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) 1933లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెల్లడించిన ఫర్మానా ఉద్దేశ్యం ఏంటి ? జ: ఉద్యోగాల్లో ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వడం. నాన్ ముల్కీలను తాత్కాలిక ప్రాతిపదికన నియామకం. 2) ముల్కీల హక్కులు కాపాడటానికి ఏర్పడిన ప్రజా సంస్థ ఏది ? జ: 1934లో నిజాం ప్రజల సంఘం (నిజాం సబ్జెక్ట్స్ లీగ్) 3) నిజాం ప్రజల సంఘంను ఉర్దూలో ఏమంటారు ? జ: జమీయత్ రిఫాయామే నిజాం (అధ్యక్షుడు : నవాబ్ సర్ నిజామత్ జంగ్) 4) ముల్కీలీగ్ ఏ భాషను ప్రోత్సహించాలని కోరింది ? జ: హిందీ (హిందూస్థానీని) 5) నిజాం ముల్కీ లీగ్ ఏమని నినాదం ఇచ్చింది ? జ: హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ 6) ముల్కీలీగ్ నుంచి చీలిపోయి హిందువులు ఏ సంస్థను స్థాపించారు ? జ: పీపుల్స్ కన్వెన్షన్ 7) హైదరాబాద్ స్టేట్ లో రాజకీయ సంస్కరణలు తెచ్చేందుకు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరి అధ్యక్షతన రాజకీయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు ? జ: దివాన్ బహుదూర్ అరవమూడి అయ్యంగార్ (ఛైర్మన

ముల్కీ – గైర్ ముల్కీ సమస్యలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) ముల్కీ అనే పదానికి అర్థమేంటి ? ముల్కీ-గైర్ ముల్కీ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది ? జ: ముల్కీ అనగా స్థానికుడు. ఈ సమస్య బహమనీల కాలం నుంచే మొదలైంది. 2) దక్కనీలు, అఫాకీలుగా ఎవరిని వ్యవహరించేవారు? జ) ముల్కీలు, గైర్ ముల్కీలు 3) అఫాకీలు, దక్కనీలు అంటే ఎవరు ? జ: అఫాకీలంటే షియాలు, దక్కనీలు అంటే సున్నీలు 4) ముల్కీ, గైర్ ముల్కీ సమస్యలతో అంతమైన రాజ్యం ఏది ? జ: బహమనీ రాజ్యం (క్రీ.శ.16వ శతాబ్దంలో) 5) కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించిన సుల్తాన్ కులీ కుతుబ్ షా.. హైదరాబాద్ సంస్థానంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు ? జ: ముల్కీలు (స్థానికులకు) 6) మొదటి సాలార్ జంగ్ తన పరిపాలనలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు ? జ: కాయస్తులు, ఖత్రీలు 7) సాలార్ జంగ్ తన పరిపాలనా సంస్కరణల్లో ఉపయోగపడేందుకు ఎవరిని హైదరాబాద్ లో ఉద్యోగాల్లో నియమించాడు ? జ: అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులను రప్పించాడు 8) సాలార్ జంగ్ హయాంలో

హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్ సంస్కరణలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్దాపించారు? జ) మీర్ ఖమ్రుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ @ నిజాముల్ ముల్క్ (1724) 2) చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి ? జ: కుర్ర కత్తి వీరుడు 3) నిజాం పాలనలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత? జ) విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు 4) నిజాముల్ ముల్క్ అసఫ్ జాహీ రాజ్యం స్థాపించినప్పుడు రాజధాని ఏది ? జ: ఔరంగాబాద్. 1770 తర్వాత హైదరాబాద్ కి మార్చాడు 5) నిజాముల్ ముల్క్ కాలంలో ఎన్ని సుభాలు ఉండేవి ? జ: 6 సుభాలు. ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, ఖాందేష్, బీదర్, బీరార్ (వీటినే స్మిత్ లు అని కూడా అంటారు ) 6) రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించిన విధానం ? జ) జాగీర్దారీ పద్దతి 7) జాగీర్ అనే పదానికి అర్థమేంటి ? వీటిని ఎవరికి ఇచ్చేవారు ? జ: జాగీర్ అంటే పర్షియన్ భాషలో ‘ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం’. దీన్ని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసే వారికి ఇచ్చేవారు. 8) జాగీర్దారీ విధానం మొగలులు