Sunday, June 24
Log In

Author: VishnuM72

ఆదాయం పన్ను చట్టంపై ఈశ్వర్ కమిటీ నివేదిక

National Issues
ఆదాయం పన్ను చట్టం -1961లో మార్పులు చేర్పులు చేసి దాన్ని మరింత సరళం చేసేందుకు జస్టిస్ R.V.ఈశ్వర్ కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ పరిపాలనా పరమైన 27 సూచనలు, 8 సిఫార్సులను కేంద్రానికి చేసింది. పన్ను వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ఏకసభ్య బెంచ్ విచారణ పరిమితిని రూ.15లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచాలి. సెక్షన్ 30,31ల్లోని టీడీఎస్ ల చెల్లింపులో కాలపరిమితి, దాఖలుకు సంబంధించిన మార్పులు చేయాలి. దీర్ఘ, స్వల్పకాలిక పన్నుల్లో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం దీన్ని నియమించింది.

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్’ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. పల్లెలల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలను నిరోధించేందుకు ఉద్దేశించిందే ఈ పథకం. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లా కురుభత్ గ్రామంలో ప్రధాని ఈ పథకం ప్రారంభించారు. మూడేళ్ళలో 300 గ్రామాలను ఈ రూర్భన్ మిషన్ కింద అభివృద్ధి చేయాలన్నది కేంద్రం లక్ష్యం. పథకంలో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు ఎలక్ట్రానిక్ సేవలు అందించడం, డిజిటల్ అక్షరాస్యత, మొబైల్ హెల్త్ యూనిట్లు, విద్య, పారిశుధ్యం, తాగు నీటి సరఫరా, పట్టణాలతో గ్రామాల రహదారులను అనుసంధానం చేయడం, యువతలో నైపుణ్యాలపై శిక్షణ లాంటి అంశాలు ఉన్నాయి.

దేశంలోనే ఎత్తయిన జాతీయ పతాకం

National Issues
దేశంలోనే అత్యంత ఎత్తయిన, పెద్దదైన జాతీయ జెండాను రాంచీలోని పహారీ మందిర్లో ఆవిష్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్బంగా ఈ పతాకాన్ని ఎగురవేశారు. 66 అడుగుల ఎత్తు, 99 అడుగుల వెడల్పు ఉంది. 293 అడుగుల ఎత్తులో ఓ స్థంభంపై ఎగుర వేశారు.

ప్రమాదకరమైన యుద్ధక్షేత్రం సియాచిన్

National Issues
ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ కొండలు. 2016 ఫిబ్రవరి 3న ఇక్కడ సంభవించిన ఘోర విపత్తుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. మంచు తుఫాన్ తో ఓ జూనియర్ కమాన్డ్ ఆఫీసర్ తో పాటు 9 మంది సైనికులు చనిపోయారు. సియాచిన్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆ తర్వాత ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. సియాచిన్ అంటే టిబెటన్ భాష ‘బాల్టీ‘ లో గులాబీ వనం అని అర్థం. ఇది హిమాయాల్లోని కారాకోరం తూర్పు పర్వత శ్రేణుల్లో ఉంది. సియాచిన్ సముద్ర మట్టం నుంచి 6,753 మీటర్లు (18,875 అడుగులు) ఎత్తు ఉంటుంది. విస్తీర్ణం 700 చకీమీ. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలుగా ఉంటాయి. మన దేశానికి రోజుకి సగటున 7 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఏడాదికి 2,500 కోట్లు. 1984 నుంచి 2015 మధ్యకాలంలో మంచుకొండలు విరిగిపడి 869 మంది చనిపోయారు. 1949లో భారత్ -పాకిస్తాన్ మధ్య కుదిరిన ‘కరాచీ ఒప్పందం’ మేరకు పాక్ ఆక్రమిత

జికా వైరస్

International Issues
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మొదట బ్రెజిల్ ప్రారంభమైన ఈ వ్యాధి అమెరికాకు తర్వాత యూరప్ లకు వ్యాపించింది. అడెస్ అజెప్టి దోమ వల్లే జికా వైరస్ సోకుతుంది. డెంగీ, చికున్ గున్యాకి కూడా ఇదే కారణం. 1947లో ఉగండా లో దీన్ని కనుగొన్నారు. 2015లో బ్రెజిల్ లో ప్రారంభమైన జికా వైరస్ గర్బిణీలకు సోకింది. దాంతో పుట్టిన 4 వేల మంది పిల్లలు బుల్లి తల, పెద్ద శరీరంతో పుట్టారు. వీరిలో 49 మంది చనిపోయారు. 2018 వరకూ గర్భం దాల్చవద్దని ఎల్ సాల్విడార్ సర్కార్ తన దేశ మహిళలకు సూచించింది. మరోవైపు జికా వైరస్ కు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ టీకాను అభివృద్ధి చేస్తోంది.

స్టార్టప్ లకు కేంద్రం ప్రోత్సాహం

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
భారతదేశంలో స్టార్టప్ (అంకుర) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10వేల కోట్ల మూలనిధిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత జీవిత బీమా సంస్థ (LIC) దీనికి సహ పెట్టుబడి దారు. స్టార్టప్ పరిశ్రమలకు 3యేళ్ళ పాటు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేస్తారు. మొదటి విడతగా రూ.2,500 కోట్ల మూలనిధిని ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో స్టార్టప్ లకు మూడో కేంద్రంగా భారత్ నిలిచింది. అమెరికా, బ్రిటన్ తర్వాత ఇక్కడే స్టార్టప్ లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి.

పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి

National Issues
2016 జనవరి 2 న ఉదయం 3.30 గంటలప్పుడు పఠాన్ కోట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు భారత సైనికులు చనిపోయారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సభ్యుడు, లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, షూటింగ్ మెడలిస్ట్ సుబేదార్ ఫతే సింగ్ ఉన్నారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు.

PSLV C-31 ప్రయోగం

National Issues
ఇప్పటిదాకా విదేశీ దిక్సూచీ వ్యవస్థనే నమ్ముకున్న మన దేశం... ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా నావిగేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేసుకుంటోంది. ఆ కల నెరవేర్చుకునేందుకు IRNSS-1Eని ఇస్రో శాస్త్రవేత్తలు 2016 జనవరి 20 న ఏపీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి రీజినల్ నేవిగేషన్ సిస్టమ్ - IRNSSను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. దీని జీవిత కాలం 12యేళ్ళు. ఈ ఉపగ్రహం ద్వారా భూమి, ఆకాశం, సాగరాల్లో దిక్సూచీ వ్యవస్థను చూపెడుతుంది. వాహనాల గమనాన్ని సూచించడంతో పాటు భద్రతా బలగాలకు కూడా సేవలు అందిస్తుంది. అమెరికా నేవిగేషన్ వ్యవస్థ - గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) రష్యా - గ్లోబల్ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ( GLONASS) యూరప్ - గెలీలియో చైనా - బీదౌ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ జపాన్ - క్యాసీ జెనిత్ ఉపగ్రహ వ్యవస్థ (QZSS)

హైడ్రోజన్ బాంబు ప్రయోగం

International Issues
అణుబాంబు కన్నా శక్తివంతమైనది హైడ్రోజన్ బాంబు. దీని ప్రయోగం 2016 జనవరి6న విజయవంతంగా నిర్వహించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అణుబాంబు అణు విచ్ఛిత్తి ద్వారా నిర్మితమైతే, హైడ్రోజన్ బాంబు అణు సంలీనం (ఫ్యూజన్) ఆధారంగా తయారవుతుంది. ఇది అనేక వందల రెట్లు శక్తి ఎక్కువ. హైడ్రోజన్ బాంబు ప్రయోగాన్ని అమెరికా సహా అన్ని దేశాలు ఖండించాయి. ఇంతకుముందు 1952లో హైడ్రోజన్ బాంబును అమెరికా ప్రయోగించింది. ఆ పరీక్షకు పసిఫిక్ మహాసముద్రంలోని ఓ ద్వీపం తుడిచిపెట్టుకుపోయింది. 1953లో సోవియట్ యూనియన్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. 1961లో మళ్లీ రష్యా జార్ బాంబా అనే హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. ఇందులో 57 మెగా టన్నుల శక్తి విడుదల అయింది.

1. జీవశాస్త్రం

జీవ శాస్త్రం
1) జీవశాస్త్రానికి బయాలజీ పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? జ: జీన్ లామార్క్ ( ఫ్రెంచ్ శాస్త్రవేత్త )(1809). 2) బయాలజీ అనేది ఏ పదం ? దాని అర్దం ఏంటి? జ: బయాలజీ అనేది గ్రీకు పదం. బయో అంటే జీవం, లోగోస్ అనగా శాస్త్రం 3) జీవ శాస్త్ర పితా మహుడు, వృక్షశాస్త్ర పితా మహుడు ఎవరు? జ.అరిస్టాటిల్ (జీవశాస్త్రం), థియో ఫ్రాస్టస్ ( వృక్షశాస్త్రం) 4) సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జ: లూయి పాశ్చర్ 5) టాక్సానమీ అంటే ఏంటి ? ఈ పదాన్ని సూచించింది ఎవరు ? జ: జీవుల పోలికలను బట్టి గుర్తించడం, దానికి పేరు పెట్టడం, వర్గీకరించడాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ పదాన్ని సూచించింది APD కండోల్ (ఫ్రెంచ్ శాస్త్రవేత్త). 6) జీవులను వర్గీకరించాలన్న ప్రతిపాదనను మొదట తెచ్చింది ఎవరు ? జ: అరిస్టాటిల్ 7) అరిస్టాటిల్ రాసిన గ్రంథమేది ? అందులో జంతువులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ? జ: హిస్టోరియా యానిమాలియమ్. ఈ గ్రంథంల