Sunday, August 19
Log In

Author: VishnuM72

భారతీయ శాస్త్రీయ నృత్యాలు

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు
1) శాస్త్రీయ, జానపద నృత్యాలు ఎవరి నాట్య శాస్త్ర సూత్రాలపై ఆధారపడి రూపొందించబడినవి ? జ: భరతముని 2) భరత నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ? జ: తమిళనాడు 3) దేశీయ నృత్యాల గురించి 11 వ శతాబ్దంలో వివరించిన వారెవరు ? జ: సోమేశ్వరుడు, భోజుడు 4) కాకతీయుల కాలంలో నృత్యరత్నావళిలో మార్గ-దేశీ నృత్య సంప్రదాయాలను వివరించినది ఎవరు ? జ: జాయప సేనాని 5) అభినయ దర్పణం, గీతా గోవిందం నాట్యగ్రంథాల రచయితలు ఎవరు ? జ: అభియన దర్పణం - నందికేశ్వరుడు, గీతగోవిందం - జయదేవుడు 6) నాట్యానికి ఏ నాలుగు ఉపాంగాలు అవసరమని భరతుడు తెలిపాడు ? జ: అంగిక, వాచక, ఆహార్య, సాత్వికములు

గుహలు, దేవాలయాలు

భార‌త‌దేశ వాస్తు ,శిల్ప‌క‌ళ‌
1) వాస్తు, చిత్ర, శిల్పకళలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? జ: మహారాష్ట్రలోని ఔరంగా బాద్ లో 2) ఎల్లోరాలో ఏయే వాస్తు కళలతో శిల్పాలను చెక్కారు ? జ: బౌద్ధం, హిందూ మతంనకు చెందిన వాస్తు కళ 3) ఏకశిలా గుహతో నిర్మితమై ఉంది, బౌద్ధ కట్టడాలను పోలి ఉన్న ఆలయం ఏది ? జ: కైలాస నాథ ఆలయం 4) ఏ మత ప్రభావం వల్ల భారతీయ వాస్తు నిర్మాణంలో రాతిని ఉపయోగించారు ? జ: బౌద్ధ మతం 5) బుద్ధుడు చనిపోయాక అతని భౌతిక అవశేషాల మీద కట్టిన నిర్మాణాన్ని ఏమంటారు ? జ: స్థూపం 6) అరేబియా సముద్రంలోని ఓ దీవిలో ఏనుగులాగా కనిపించే గుహలు ఏవి ? జ: ఎలిఫెంటా గుహలు 7) ఎలిఫెంటా గుహల్లో ప్రసిద్ధి చెందిన శిల్పం ఏది ? జ: మూడు శిరస్సులు కలిగిన శివుడు 8) దక్షిణ భారత్ లో గుహాలయాల్లో దీర్ఘ చతురస్రాకారంలో కనిపించేవి ఏవి ? జ: మండపాలు 9) భారత్ లో దేవాలయాల వాస్తు కళ ఏ రాజుల కాలం నుంచి మొదలైంది ? జ: గుప్తులు 10) దేవా

సింధూ నాగరికత కాలంలో శిల్పకళ

భార‌త‌దేశ వాస్తు ,శిల్ప‌క‌ళ‌
1) సింధూ నాగరికతలో శిల్పకళకు ఉదాహరణగా వేటిని చెప్పుకోవచ్చు ? జ: హరప్పా శిధిలాల్లో దొరికిన మృణ్మయ పాత్రలు 2) ప్లాస్టిక్ కళలో సింధులోయ ప్రజలకు ప్రవేశం ఉందని చెప్పేందుకు ఉదాహరణ ఏది ? జ: హరప్పా శిథిలాల్లో దొరికిన ఇసుక రాతి విగ్రహాలు 3) సింధూ నాగరికతకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాఖండాలుగా వేటిని చెబుతారు ? జ: మొహంజాదారోలోని ధాన్యాగారాలు, స్నానవాటిక 4) విగ్రహారాధన అనేది భారతీయ కళల్లో మొదట ఏ సంస్కృతిలో కనిపిస్తుంది ? జ: హరప్పా సంస్కృతి 5) సింధు నాగరికతలో అత్యుత్తమ లోహ నమూనా ఏది ? జ: మొహెంజోదారోలో లభించిన, నగ్నంగా ఉన్న నాట్యగత్తె కాంస్య ప్రతిమ 6) అలాగే ఉత్తర రాతి నమూనా ఏది ? జ: గడ్డంతో ఉన్న పురుషుడి స్టీటైట్ ప్రతిమ

మొగలుల చిత్రకళలు

భార‌త‌దేశ‌చిత్ర‌లేఖ‌నం
1) పర్షియా ప్రభావంతో కాగితంపై చిత్రలేఖనాన్ని ప్రవేశపెట్టిన రాజులు ఎవరు ? జ: మొగలులు 2) భారతీయ, పర్షియన్ చిత్రకళల సమ్మిళితంగా దేన్ని చెప్పుకోవచ్చు ? జ: సుల్లానుల చిత్రకళ 3) కాగితంపై చిత్రాలను గీయడాన్ని ఏమంటారు ? జ: లఘు చిత్రకళ 4) మానవులు చిత్రపటాలను గీయడం ఎవరి ప్రత్యేకత ? జ: మొగలు చిత్రకళాకారులు 5) మొగల్ చిత్రకళ ఏ రాజు కాలంలో ఉన్నత స్థితికి చేరింది ? జ: జహంగీర్ 6) రాజవంశీయులే కాదు మహనీయులు, మహాత్ములు, నాట్యకర్తలు, ప్రేమికులు లాంటి వారి చిత్రాలను కూడా ఎవరి కాలం నుంచి గీయించడం మొదలుపెట్టారు ? జ: జహంగీర్ 7) పర్షియాలోని ఆర్ట్ గ్యాలరీలను సందర్శించి చిత్రలేఖనం ఇష్టం పెంచుకున్న రాజు ఎవరు ? జ: హుమాయూన్ 8) చిత్రాలను గీయడానికి ప్రత్యేకంగా విదేశాల నుంచి కళాకారులను రప్పించిన రాజు ఎవరు ? జ: జహంగీర్ 9) హుమయూన్ కాలంలో భారత్ కు వచ్చిన ఖ్వాజా అబ్దుస్ సమద్, మీర్ సయ్యద్ అలీ ఏ దేశానికి చెందిన వ

విజయనగర కాలంలో చిత్రకళ

భార‌త‌దేశ‌చిత్ర‌లేఖ‌నం
1) హంపి, అనెగొండి, తాడిపత్రి, లేపాక్షి, కాంచీపురం, కాళహస్తి, తిరుపతి... లాంటి పుణ్యక్షేత్రాల్లో కనిపించే చిత్రలేఖనాలు ఏ రాజుల కాలం నాటివి ? జ: విజయనగర రాజులు 2) పల్లకీలో విద్యారణ్యస్వామిని ఊరేగిస్తున్నట్టుగా ఉండే చిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి ? జ: హంపీలోని విరూపాక్ష ఆలయంలో 3) వటపత్రశాయి, సీతారాముల అరణ్యవాసం, కిరాతార్జునీయం చిత్రాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి ? జ: లేపాక్షిలో 4) రావణ సంహార ఘటాలను ఎక్కడ చిత్రీకరించారు ? జ: అనెగొంది లో 5) వీరభద్రుని చిత్రం, రామాయణ, మహాభారతాల చిత్రలేఖనాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి ? జ: లేపాక్షిలోని విరూపాక్ష ఆలయంలో 6) కంచిలోని వరదరాజు ఆలయంలో కనిపించే దృశ్య కావ్యం ఏది ? జ: మన్మధుడు 7) చెట్లు, కొండలు లాంటి ప్రకృతి దృశ్యాలను ఏ రాజులు ఉపయోగించలేదు ? జ: విజయనగర రాజులు

భారతీయ చిత్రకళ

భార‌త‌దేశ‌చిత్ర‌లేఖ‌నం
1) భారత దేశంలో మొదటిసారిగా గోడల మీద చిత్రాలు ఎక్కడ బయటపడ్డాయి ? జ: అజంతా గుహల్లో 2) చిత్రలేఖనంలోని నమూనా, రూపబేధ, భవయోజన, ప్రమాణ, వర్ణకాభంగ, సదృశ్య, లావణ్య యోజన అనే ఆరు రూపాలు ఉంటాయి. వీటిని ఏమంటారు ? జ: షడంగ 3) ఏ రాజుల కాలంలో చిత్ర కళకు మంచి ఆదరణ లభించింది ? జ: గుప్తుల కాలంలో 4) భోది సత్వుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా జీవిత విశేషాలను ఏ గుహల్లో చిత్రీకరించారు ? జ: అజంతా గుహల్లో 5) గుప్తుల చిత్రలేఖనానికి ఏయే గుహలు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు ? జ: అజంతా, బాగ్ ( స్త్రీ, పురుషుల బొమ్మలు అందంగా చిత్రీకరణ) 6) చిత్ర లేఖకులకు 10 గ్రామాలు దర్శనం ఇచ్చినట్టు ఏ గ్రంథం చెబుతోంది ? జ: సోమదేవుని కథాపరిత్సాగం 7) ఏ గుహల్లో శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఉన్నాయి ? జ: అజంతాలోని 2,10 గుహల్లో 8) జంతువులు, పువ్వులు, చెట్లు లాంటి ప్రకృతి సంబధమైనవి, గరుడ, యక్ష, గంధర్వుల చిత్రాలు మనకు ఏ గుహల్ల

భారతీయ సంగీతం

భార‌త‌దేశ సంగీతం
1) భారతీయ సంగీతం కాలక్రమేణా ఏ సంగీతాలుగా విడిపోయింది? జ: కర్నాటక-హిందూస్దానీ 2) ఉత్తర, దక్షిణ సంప్రదాయాలను ఏమని పిలుస్తారు ? జ: ఉత్తర సంప్రదాయం : హిందూస్దానీ దక్షిణ సంప్రదాయం : కర్నాటక సంగీతం 3) భక్తి సంగీతాన్ని ఎవరు సృష్టించారు? జ: సూరదాసు, తులసీదాసు, మీరా బాయి 4) కర్నాటక సంగీతానికి మూలపురుషులు ఎవరు? జ: త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి, పురంధరదాసు 5) వాగ్గేయకారులని ఎవరిని అంటారు? జ: భక్త తుకారాం, జయదేవుడు, కబీరు, తులసీదాసు, చైతన్యుడు 6) భారతీయ సంగీతంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి ? జ: సప్త స్వరాలు ( సరిగమపదనిస) 7) భారతీయ సంగీతంలో తాళాలు, తాళ సమ్మేళనాలు ఎన్ని ఉన్నాయి? జ: 32 (తాళాలు), 120 (తాళ సమ్మేళనాలు) 8) అత్యంత ప్రాచీనమైన భారతీయ సంప్రదాయ మౌలిక శైలి ఏది? జ: ధృపద్ 9) భారతీయ సంగీతంలో ఏది శ్రావ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది ? జ: రాగం 10) ద్రుపదలు, ఖయాల్స్, ఖవ్వా

జైన సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) జైన మతాన్ని స్థాపించింది ఎవరు ? ఈ మతానికి మూలపురుషులు ఎవరు ? జ: రిషభనాధుడు - తీర్థంకరులు 2) జైనమత సంస్కృతిలో ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు ? జ: 24 మంది 3) పురోహితుల ఆధిక్యతను, వేదాలను ఖండించి... కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఉంచినదెవరు ? జ: వర్ధమాన మహావీరుడు 4) మోక్ష మార్గానికి జైన మతం చెప్పిన త్రిరత్నాలు ఏవి ? జ: 1) సరియైన విశ్వాపం 2) సరియైన జ్ఞానం 3) సరియైన నడవడిక 5) శరీరాన్ని కృశింపజేసి చనిపోవాలన్న జైనుల ఆదర్శాన్ని ఏమంటారు ? జ: సల్లేఖన వ్రతం 6) వేదాల ప్రామాణికత, కర్మకాండలను జైన మతం తిరస్కరించినా ఏ సిద్ధాంతాన్ని అంగీకరించింది ? జ: ఆత్మ పునరావృతి 7) వర్ధమాన మహావీరుడిని జినుడు అంటారు. ఆయన పేరుమీదుగా ఆయ శిష్యులను జినులు (జైనులు) అంటారు. అయితే జినుడు అంటే అర్థం ఏంటి ? జ: విజేత 8) జైనమతంలో ఉన్న రెండు శాఖలు ఏవి ? జ: దిగంబరులు, శ్వేతాంబరులు 9) బంధాలను తెంచుకున్నారు కాబట్టి జైనులను ఏమ

బౌద్ధ సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) దు:ఖానికి హేతువు కోరికలు. వాటని జయించినట్లయితే సర్వ దు:ఖాలు దూరమవుతాయని నమ్మినది ఎవరు? జ: బౌద్ధ మతం 2) దు:ఖ సాగరాన్ని జయించడానికి ఏకైక మార్గం ఏమి అనుసరించాలని బౌద్ధమతం చెబుతుంది ? జ: అష్టాంగ మార్గం 3) భగవంతుడు, ఆత్మ, వేదాలు, వర్ణవ్యవస్థను ఎవరు తిరస్కరించారు ? జ: గౌతమ బుద్ధుడు 4) బౌద్ధమతంలో మహాయానం, వజ్రయానం తర్వాత వచ్చిన శాఖ ఏది ? జ: తాంత్రిక యానం (మంత్రాలు వల్లెవేయడం) 5) దు:ఖం, దు:ఖకారణం, దు:ఖ నివారణ, దు:ఖ నివారణ మార్గం అనే వాటిని ఏమంటారు ? జ: ఆర్య సత్యాలు

వేదకాలం నాటి సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) విద్ అనే సంస్కృత ధాతువునుంచి ఏ పదం ఉద్భవించింది ? జ: వేద 2) వేద సాహిత్యాన్ని, వేదాంగాలను ఏమని అంటారు ? జ: వేద సాహిత్యాన్ని శృతి అనీ, వేదాంగాలను స్మృతి అంటారు 3) ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు ? జ: మధ్య ఆసియా నుంచి 4) రుగ్వేద కాలంలో గ్రామానికి ఎవరు నాయకత్వం వహించేవారు? జ: గ్రామణి 5) రాజుకు సహాయకారిగా, రాజును నియంత్రించేవిగా ఏవి ఉండేవి ? జ: సభ, సమితి 6) స్త్రీలకు ఏ కాలంలో మంచి గౌరవం ఉండేది ? జ: రుగ్వేద కాలంలో ( మలివేద కాలంలో స్త్రీలకు గౌరవం లేదు) 7) రుగ్వేద కాలంలో తెగల నాయకుడిని ఏమనేవారు ? అతని విధులు ఏమిటి ? జ: రాజన్. పశువులను రక్షించడం, యుద్ధాలు చేయడం, తెగల తరపున దేవతలను ప్రార్థించడం 8) రాజుకు పాలనలో ఎవరెవరు సహకరించేవారు ? జ: సేనాని, గ్రామణి, పురోహితుడు 9) రాజులు రాజసూయ యాగం, అశ్వమేధం, వాజ పేయం యాగాలు నిర్వహించేవాడని ఏ గ్రంథంలో ఉంది