Tuesday, October 16
Log In

ఆగస్టులోనే పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ ఎగ్జామ్

పోలీస్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టులోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనుంది. ఆగస్టు చివరి వారంలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగే అవకాశాలున్నాయి. ఎంపిక ప్రక్రియను అనుకున్న టైమ్ లోగా పూర్తి చేయాలన్నది బోర్డు ఆలోచనగా ఉంది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుల గడువు జూన్ 30తో ముగిసింది. మొత్తం 18,428 పోస్టులకు 7.19 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. వీటిల్లో సివిల్, ఏఆర్, బెటాలియన్, SPF కేటగిరీల్లోని కానిస్టుబల్ పోస్టులకు 4.79 లక్షల మంది అప్లయ్ చేశారు. అలాగే సివిల్, AR, బెటాలియన్ సబ్ ఇన్సెపెక్టర్ల పోస్టులకు 1,88,715 మంది అప్లయ్ చేశారు. 2015-16 నోటిఫికేషన్ కంటే ఈసారి 6శాతం మంది ఎక్కువగా పోలీస్ జాబ్స్ కి అప్లయ్ చేశారు.

(నోట్: తక్కువ రోజుల్లో మీ టైమ్ ఎలా సద్వినియోగం చేసుకోవాలో... ఈ వారంలో మీకు యూ ట్యూబ్ ద్వారా వివరాలు అందిస్తాను. ప్రతి రోజూ రివిజన్ తర్వాత మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి... ఎన్ని టెస్టులు రాస్తే అంతమంచిది.  టెస్ట్ రాశాక అందులో తప్పులు ఎందుకు వచ్చాయి... వాటికి సంబంధించిన మెటీరియల్ లో రివిజన్ చేసుకోండి )