అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్, 1230 పోస్టులు

అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్, 1230 పోస్టులు

అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్, 1230 పోస్టులు

వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1230 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆయా విభాగాల్లో టెక్నికల్, ట్రేడ్స్ మెన్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ దరఖాస్తులను ఆన్ లైన్ లో 2021, అక్టోబర్ 25వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చునని తెలిపింది.

TELANGANA: 48, ANDHRAPRADESH: 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కావాల్సిన అర్హతలు: కనీస విద్యా అర్హత 10వ తరగతి, టెక్నిల్ విభాగంలో  ITI (ఎలక్ట్రీషియన్, డిజిల్ మెకానిక్ తో పాటుగా తదితర రంగాలలో)  పాస్ అయి ఉండాలి. ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుసుకోవచ్చును.

వయస్సు: అభ్యర్థులు 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారు మాత్రమే అప్లై చేయాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్టు, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎన్నిక ఉంటుంది. కనీసం రన్నింగ్ తో పాటుగా ఆయా విభాగాల్లో సెలక్ట్ కావాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ : 2021, అక్టోబర్ 25వ తేదీ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
వెబ్ సైట్: assamrifles.gov.in.