Thursday, December 13

ఆసియా క్రీడలు – 2018 (20ప్రశ్నలు)

01) ఆసియన్ గేమ్స్ ని 1912లో మొదట ఏ పేరుతో జపాన్, ఫిలిప్పీన్స్, చైనా మొదలు పెట్టాయి. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ?
జ: ఫార్ ఈస్ట్రన్ గేమ్స్ ఛాంపియన్షిప్, ఆరు దేశాలు
02) ఫార్ ఈస్ట్రన్ గేమ్స్ ఛాంపియన్షిప్ పేరుతో 1912లో మొదలైన క్రీడలు ఎప్పటి వరకూ కొనసాగాయి ?
జ: 1934 వరకూ
03) ఫార్ ఈస్ట్రన్ గేమ్స్ ఛాంపియన్షిప్ తో జరిగిన క్రీడల్లో భారత్ ఏ సంవత్సరంలో పాల్గొంది ?
జ: 1930 లో
04) 1951లో తొలి ఆసియా క్రీడలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి ?
జ: ఢిల్లీలో
05) 1951లో తొలి ఆసియా క్రీడలను ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
06) 1948లో సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన సమావేశంలో.. ఫార్ ఈస్ట్రన్ క్రీడలకు బదులు ఆసియన్ గేమ్స్ పేరును తెరమీదకి తెచ్చింది ఎవరు ?
జ: భారత ప్రతినిధి గురుదత్ సోంధి
07) భారత్ లో ఆసియా క్రీడలు ఎన్నిసార్లు జరిగాయి ?
జ: రెండు సార్లు ( 1951, 1982 లో )
08) ఆసియా క్రీడలను నాలుగు సార్లు నిర్వహించిన దేశం ఏది ?
జ: థాయ్ లాండ్
09) ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో ఏయే దేశాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి ?
జ: చైనా, జపాన్
10) 2018లో ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో
11) 2018 లో ఆసియా క్రీడలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరుగుతాయి ?
జ: 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ వరకూ
12) 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ వరకూ ఇండోనేషియాలో జరిగే ఆసియా క్రీడల్లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి ?
జ: 45 దేశాలు
13) ఇండోనేషియాలో జరిగే 18వ ఆసియా క్రీడల్లో 40 క్రీడాంశాల్లో ఎన్ని ఈవెంట్లు జరుగుతాయి ?
జ: 465 ఈవెంట్సు
14) కామన్వెల్త్ క్రీడల్లో దేశాల్లో పాల్గొంటాయి ?
జ: 71 దేశాలు
15) 2018 ఆసియా క్రీడల మోటో ఏంటి
జ: Energy of Asia ( Indonesian: Energi Asia)
16) 2018 ఇండోనేషియాలో జరిగే ఆసియా క్రీడలకు ప్రధాన వేదిక ఏది ?
జ: జెలోరా బంగ్ కర్నో స్టేడియం
17) 2018 జులై 13న ఇండోనేసియన్ ఆసియాన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ అధికారికంగా ఏషియన్ గేమ్స్: ఎనర్జీ ఆఫ్ ఆసియా పేరుతో మ్యూజికల్ ఆల్బమ్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి ?
జ: 13 పాటలు
18) 2018 ఆసియా క్రీడలకు సంబంధించి టార్చ్ రిలే 2018 జులై 15న ఎక్కడ ప్రారంభమైంది ?
జ: మేజర్ ధ్యాన్ ఛంద్ నేషనల్ స్టేడియం, న్యూ ఢిల్లీ
(నోట్: ఈ టార్చ్ రిలే 54 సిటీలు, ఇండోనేషియాలోని 18 ప్రొవిన్స్ లు తిరిగి ఆగస్ట్ 17న ముగుస్తుంది )
19) ఆసియా క్రీడలకు వచ్చే ప్లేయర్స్ ఉండటానికి 10 హెక్టార్ల విస్తీర్ణంలో జకర్తా దగ్గర్లోని ఏ ప్రాంతంలో అథ్లెట్స్ విలేజ్ ను నిర్మించారు ?
జ: కెమాయోరన్
20) ఆసియా క్రీడల ప్రారంభ, ముగింపు ఉత్సవాలను ఎక్కడ నిర్వహిస్తారు ?
జ: పాలెంబాంగ్