ఆరోగ్య లక్ష్మి

1) రాష్ట్రంలో ప్రతి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రారంభించిన పథకం ఏది ?
జ: ఆరోగ్య లక్ష్మి
2) ఆరోగ్య లక్ష్మి పథకం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు ?
జ: 2015 జనవరి 1 - సీఎం కేసీఆర్
3) ఆరోగ్య లక్ష్మి పథకం ఏ కేంద్రాల్లో అమలు చేస్తున్నారు ?
జ: అంగన్ వాడీ కేంద్రాల్లో
4) ఆరోగ్య లక్ష్మి పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ?
జ: ఇందిరమ్మ అమృత హస్తం
5) బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన పథకం పేరేంటి ?
జ: ఆరోగ్య లక్ష్మి

6) ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులకు ఎంత మొత్తాన్ని రాష్టప్రభుత్వం ఇస్తుంది ?
జ: ఒక్కో గర్భిణికి మొత్తం రూ.12 వేలు
హాస్పిటల్ చేరిన వెంటనే - రూ.4వేలు
ప్రసూతి తర్వాత డిశ్చార్జి టైమ్ లో : రూ.4వేలు

పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోడానికి వచ్చినప్పుడు : రూ.4వేలు
7) ఆడపిల్ల ప్రసవించిన పేద మహిళలకు ప్రభుత్వం అదనంగా ఎంత మొత్తం ఇవ్వనుంది ?
జ: వెయ్యి రూపాయిలు