Monday, August 19

2018 APR CA – TOP 50 (1st Part)

01) రేషన్ కార్డుదారులు ఇకపై ఏ రేషన్ షాపు నుంచైనా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పొందేలా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారు ?
జ: ఏప్రిల్ 1 , 2018
02) చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ - 1 ప్రస్థానం ముగిసింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు ?
జ: 2011 సెప్టెంబర్ 29 న ప్రయోగించారు
(నోట్: 2022 కల్లా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అయితే 2016 మార్చి నుంచి ఇది పనిచేయడం లేదు)
03) మహిళలకు కూడా పురుషులతో పాటు సమానంగా వేతనాలు చెల్లించాలంటూ మొదలైన ఆన్ లైన్ ఉద్యమాన్ని బ్రిటన్ ఎంపీ ప్రారంభించారు. దాని పేరేంటి ?
జ: పే మీ టూ హ్యాష్ ట్యాగ్
04) దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఏది నిలిచింది ?
జ: బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్
05) ప్రభుత్వ వ్యవహారాల్లో షెడ్యూల్డ్ కులాలను ప్రస్తావించేటప్పుడు వారిని దళిత్ అని కాకుండా ఏ పేరుతో పేర్కొనాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికరత మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది ?
జ: షెడ్యూల్డ్ కులాలు
(నోట్: రాజ్యాంగంలోని అధికరణం 341, రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి షెడ్యూల్డ్ కాస్ట్స్ అనే పేర్కొనాలి )
06) 2018-2023 ఐదేళ్ళ కాలానికి భారత క్రికెట్ ప్రసార హక్కులను గెలుచుకున్న సంస్థ ఏది ?
జ: స్టార్ ఇండియా ( మొత్తం రూ.6,138 కోట్లు )
07) అలీన ఉద్యమ దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: అజర్ బైజాన్ రాజధాని బాకూలో
08) 1) ప్రతి వెయ్యి మందికి ఒక ఆరోగ్యం కేంద్రం అందుబాటులో ఉండేలా హైదరాబాద్ సిటీలో కొత్తగా ప్రారంభించిన హాస్పిటల్స్ పేరేంటి ?
జ: బస్తీ దవాఖానాలు
09) బ్రెస్ట్ ఫీడింగ్ ను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో Mother's Absolute Affection ( MAA) ప్రోగ్రామ్ ను ఆరోగ్యశాఖ ఎక్కడ ప్రారంభించింది?
జ: హిమాచల్ ప్రదేశ్
10) ఐపీఎల్ 11వ సీజన్ లో మొత్తం ఎన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి ?
జ: 8 జట్లు
(నోట్: 10 సీజన్లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టు - 157 మ్యాచులు గెలిచిన ముంబై ఇండియన్స్)
11) రుద్రమదేవి 82 యేళ్ళ వయసులో వీరమరణం పొందింది అని చెప్పే శాసనం ఎక్కడ లభించింది ?
జ: నల్గొండ జిల్లా చండుపట్ల గ్రామంలో
(నోట్: రుద్రమదేవితో పాటు ఆమె సేనాని మల్లిఖార్జున నాయకుడు 1289 నవంబర్ లో చనిపోయిందని శాసనం చెబుతోంది)
12) చిన్నారులపై నేరాలను విచారించేందుకు హైదరాబాద్ లో ఏర్పాటైన ఏ న్యాయస్థానాన్ని ప్రారంభించారు ?
జ: చిన్నారి మిత్ర ( చైల్డ్ ఫ్రెండ్లీ )
13) ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంపుటిని రాసింది ఎవరు ?
జ: జర్నలిస్టు, కవి కృష్ణారావు
14) తెలంగాణ చరిత్ర - నూతన కోణం - పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: ప్రొ. అడపా సత్యనారాయణ
15) చిమ్మ చీకట్లో కూడా లక్ష్యాలను పెట్టి కాల్చివేయగలిగే ఏ రైఫిళ్లను దేశీయంగా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: AK 103 అసాల్ట్ రైఫిల్స్
(నోట్: దీని డిజైనర్ కలష్నికోవ్. దీన్ని రష్యా, భారత్, వెనెజులా, ఇథియోపియా దేశాల్లో వాడుతున్నారు )
16) NDAP ని విస్తరించండి ?
జ: National Data & Analytics Platform
17) కేరళలోని తిరువనంతపురంలో తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంఛింగ్ స్టేషన్ లో RH300 సౌండింగ్ రాకెట్ ను లాంఛ్ చేశారు. వీటిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
జ: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( VSSC)
18) జాతీయ స్థాయిలో స్వచ్ దూత్ పురస్కారం అందుకున్న రాష్ట్రానికి చెందిన గ్రామ దీపిక ఎవరు ?
జ: జూపల్లి నీరజ
(నోట్: సిరిసిల్లా జిల్లా కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన IKP VOA )
19) జాతీయ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం ఏ గ్రామపంచాయతీకి దక్కింది ?
జ: దుద్దెనపల్లి ( సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా ) ( రూ.10 లక్షల రివార్డు)
20) ఏ బొగ్గును మండించడం ద్వారా ఎక్కువ కార్భన్ డైయాక్సైడ్ వెలువడుతుండటంతో దాన్ని నిషేధించాలని కేంద్రం భావిస్తోంది ?
జ: పెట్ కోక్
21) భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సమానుల్లో ప్రథముడుగా రాజ్యాంగంలోని ఏ అధికరణం చెబుతోంది ?
జ: 146 వ అధికరణం
22) 2018-19 సం.నికి భారత్ వృద్ధి రేటు ఎంతగా నమోదవుతుందని ఆసియాన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రకటించింది ?
జ: 7.3 శాతం
23) విజ్డన్ మేగజైన్ అందిస్తున్న విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ
(నోట్: వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు కోహ్లీకి దక్కింది )
24) రాజకీయ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించేందుకు రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని సవరించాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది ?
జ: 324 (5) అధికరణం
25) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊరట ఇచ్చేందుకు ఎన్ని కోట్ల లోపు పెట్టుబడులతో స్థాపించే స్టార్టప్స్ కి పూర్తిగా పన్నులు మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: రూ.10 కోట్లు