Thursday, October 1

ఎమ్ సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో రేపటి నుంచి జరిగే అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ హైకోర్టులో విచారణ సందర్భంగా అన్ని ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నాలుగు యూనివర్సిటీలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే డిగ్రీ, పీజీలకు సంబంధించిన 7 సెమిస్టర్లను నిర్వహించారు. 8వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా గ్రేడ్స్ ఇస్తామని విద్యాశాఖాధికారులు తెలిపారు. 8వ సెమిస్టర్ కు మార్కులను 7 సెమిస్టర్లలో మార్కుల ఆధారంగా అందిస్తామని కోర్టుకు విన్నవించారు. అలాగే ఓయూ, JNTU డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 9కి వాయిదా పడింది.