Wednesday, May 23
Log In

వ్యవసాయ విస్తరణ అధికారుల ఫలితాలు విడుదల

వ్యవసాయ విస్తరణ అధికారుల (గ్రేడ్-2) ఫలితాలను (51/2017 నోటిఫికేషన్ ప్రకారం )TSPSC విడుదల చేసింది. మొత్తం 790 మందిని ఎంపిక చేసింది. మరో 61 పోస్టులకు సరైన అభ్యర్థులు లభించలేదని tspsc సెక్రటరీ వాణీ ప్రసాద్ తెలిపారు. వ్యవసాయ, సహకార శాఖల్లోని సబార్డినేట్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 851 అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-2) పోస్టులకు పరీక్ష నిర్వహించింది TSPSC. మొత్తం 10 వేల 118 మంది అప్లయ్ చేసుకున్నారు. 2017 నవంబర్ 23న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://www.tspsc.gov.in వెబ్ సైట్ లో పెడతామని సెక్రటరీ ఎ.వాణి ప్రసాద్ తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి

FINALRESULTSOFAEOS512017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *