Wednesday, October 23

6 & 7 OCT CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

1. పర్వతారోహణంలో భాగంగా తెలంగాణలోని సాంఘిక సంక్షేమ శాఖ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినులు లద్దాఖ్ సిల్క్ రూట్ పాస్ పర్వతాన్ని అధిరోహించారు.  వీళ్ళతో పాటు 9యేళ్ళ నందితా సింగ్ కూడా పర్వతారోహణం చేసింది. అయితే సిల్క్ రూట్ పాస్ ఎన్ని వేల అడగులు ఎత్తు ఉంది

2. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే ప్రముఖులకు సుద్ధాల ఫౌండేషన్ అందించే సుద్దాల హనుమంతు – జానకమ్మ జాతీయ అవార్డును ఎంపికైనది ఎవరు ?

3. ఒడిశా రాష్ట్రంలో జరిగిన విశ్వకవి సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ కవి సమ్మేళనం ఎక్కడ జరిగింది ?

4. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి ( GSDP) వృద్ధి రేటు ఎంతగా నమోదైంది

5. యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంగీకరించారు.  దీనికి ప్రకారం 60శాతం కంటే ఎక్కువ వైకల్యం పొందిన వారికి ఎంతమొత్తాన్ని చెల్లించనున్నారు ?

6. భారత్ క్రికెట్ జట్టు కోచ్ గా ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి తిరిగి ఎంపికయ్యారు.  ఆయన ఎంతకాలం ఈ పదవిలో కొనసాగుతారు ?

7. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ఏ రాష్ట్రం అనుకూలమైనదని డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంక్ 42 తన సర్వేలో తేల్చింది ?

8. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రధాని నరేంద్రమోడీతో న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు

బి) రెండు దేశాల మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.  తీర ప్రాంతంలో ఉమ్మడి గస్తీతో పాటు 3 ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు

సి) బంగ్లాదేశ్ గ్యాస్ ను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును, బంగ్లాదేశ్ లో నిర్మించిన వివేకానంద భవన్ ను, ఖుల్నాలో స్కిల్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ను వీడియో లింకేజ్ ద్వారా ప్రధానులిద్దరూ ప్రారంభించారు

డి) త్రిపురలోని సబ్రూమ్ పట్టణానికి అవసరమైన 1.82 క్యూసెక్కుల తాగు నీటిని బంగ్లాదేశ్ లోని ఫెని నది నుంచి తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది

9. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల రాజ్యసభ కు ఏ రాష్ట్ర నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?

10. ఆంద్రప్రదేశ్ లో వివిధ పథకాల లబ్దిదారులకు చెల్లించే మొత్తాలకు సంబంధించి జతపరచండి

1) అమ్మ ఒడి

2) రైతు భరోసా

3) దుకాణాలు నిర్వహించే నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు

4) చేనేత కుటుంబాలకు

 

ఎ) రూ.12,500

బి) రూ.15,000

సి) రూ.24,000

డి) రూ.10,000