Monday, March 30

ఈనెల 31 దాకా స్కూళ్ళు, కాలేజీలు బంద్

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈనెల 31 వరకూ అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. స్కూళ్ళు, కాలేజీలతో పాటు మాల్స్ కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లోను కూడా మూసివేయాలని ఆదేశాలిచ్చింది. నెలాఖరు దాకా సినిమాహాల్స్ కూడా బంద్ పాటించనున్నారు. ఫంక్షన్ హాల్స్ కూడా బంద్ చేస్తున్నారు.  ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.