Sunday, February 23

28 AUGUST CA QUIZ

1. తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి తెలపండి

ఎ) దేశంలోనే మొదటి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య ముంబైలో చనిపోయారు

బి) 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్, దేశంలో కిరణ్ బేడీ తర్వాత రెండో మహిళా ఐపీఎస్

సి) 20024 నుంచి 2007 అక్టోబర్ 31 వరకూ ఉత్తరాఖండ్ డీజీపీగా పనిచేశారు

డి) 1980లో దూరదర్శన్ లో ప్రసారమైన పాపులర్ సీరియల్ ఉడాన్ కాంచన్ నిజ జీవితం ఆధారంగా తీశారు.

2. 82.72 పాయింట్లతో మెరుగైన పనితీరుతో తెలంగాణ రాష్ట్ర కాలుష్య మండలికి జాతీయ స్థాయిలో ఎన్నో ర్యాంకు లభించింది.  (జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశ వ్యాప్తంగా ఉన్న 35 కాలుష్య నియంత్రణ మండళ్ళు, కమిటీల పనితీరుపై ఆడిట్ నిర్వహించి ఈ జాబితాను ప్రకటించింది )

3. రాష్ట్రంలో సర్కారీ బడుల గురించి ఈ కింది ప్రకటనలు చదివి సరైనవి గుర్తించండి

ఎ) రాష్ట్రంలోమొదటిసారిగా సర్కారీ బడుల్లో ట్యూషన్ నిర్వహించే కార్యక్రమం సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్ లో మాజీ మంత్రి హరీశ్ రావు 28 ఆగస్టు నాడు ప్రారంభించారు.

బి) సర్కారీ బడుల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఇంటికి వంద... బడికి చందా కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రారంభించారు

4. వ్యవసాయం, నీటిపారుదల యాజమాన్యంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలపై రాసిన ఎడారిలో ఒయాసిస్సు – ఇజ్రాయెల్ వ్యవసాయం పుస్తకాన్ని రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం రాసింది ఎవరు ?

5. 2019 క్రీడా అవార్డులు – పొందిన వారు జతపరచండి

1) ద్రోణాచార్య

2) ధ్యాన్ చంద్

3) ద్రోణాచార్య లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్

4) రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక సమ్మాన్

 

ఎ) జీవో స్పోర్ట్స్, గగన్ నారంగ్

బి) విమల్ కుమార్ (బ్యాడ్మింటన్)

సి) లాల్ రెమ్ సంగా (ఆర్చరీ)

డి) మెజ్ బాన్ పటేల్ (హాకీ)

6. భూ ఎడారీకరణను ఎదుర్కోడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఐరాస ఏర్పాటు చేసే సమావేశానికి సంబంధించి ఈ కింది ప్రకటనలు చదివి తప్పుగా చెప్పినది గుర్తించండి

1) ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్14) ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్ (UNCCD) సదస్సు నిర్వహిస్తున్నారు

2) ఈ సదస్సును 2019 సెప్టెంబర్ 2 నుంచి 13 వరకూ నేపాల్ లోని ఖాట్మాండులో నిర్వహించాలని నిర్ణయించారు

3) ఈ సదస్సులో 200 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు 100 మంది మంత్రులు పాల్గొంటారు.

4) దేశంలో బీడు భూములను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సాయల్ హెల్త్ కార్డ్ స్కీమ్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పర్ డ్రాప్ మో క్రాప్ లాంటి పథకాలు ప్రవేశపెట్టింది.

7. దేశంలో 29శాతం బీడుబారిన భూములు ఉన్నాయి.  ఏ ఏడాది నాటికి 50 లక్షల హెక్టార్ల బీడు భూములను తగిరిగి సారవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు

8. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ క్రికెట్ కు చేసిన సేవకు గాను దేశంలోని ఏ క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని నిర్ణయించారు ?

9. రెండేళ్ళ క్రితం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు అంగన్ వాడీ కేంద్రాల పునరుద్దరణకు విశేషంగా కృషి చేసినందుకు అలెప్పి సబ్ కలెక్టర్ కు (ఏపీలోని గుంటూరు జిల్లాకి చెందిన IAS అధికారి )కేరళ ప్రభుత్వం పురస్కారం ఇచ్చింది. ఆయన పేరేంటి ?