Sunday, August 19
Log In

281 జేఎల్ పోస్టులకు ఈనెల 31న నోటిఫికేషన్

గురుకుల జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 281 జూనియర్ లెక్చరర్ పోస్టులను తెలంగాణ గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 31న అధికారికంగా ప్రకటన వెలువడుతోంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 8 వరకూ Online లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక 3 విధాలుగా ఉంటుంది

పేపర్ - 1(100మార్కులు) : జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ సామర్థ్యం

పేపర్ -2 (100మార్కులు): సంబంధిత సబ్జెక్టులో బోధనా పద్దతులు

పేపర్ -3(100మార్కులు): సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం

ప్రాక్టికల్ డెమో - 25 మార్కులు

ఈ నోటిఫికేషన్ తర్వాత గురుకుల డిగ్రీ కాలేజీల్లోని 500 డిగ్రీ లెక్చరర్ పోస్టుల ప్రకటన కూడా వెలువడనుంది. యూజీసీ నెట్ ఫలితాల తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. గురుకుల బోర్డుకి అప్పగించిన PGT, TGT పోస్టులకు 2 ప్రకటనలకు ప్రస్తుతం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను అక్టోబర్ 2018 నాటికి పూర్తిచేయాలని గురుకుల బోర్డు అధికారులు భావిస్తున్నారు.

సొసైటీల వారీగా జేఎల్ పోస్టుల వివరాలు:

ఎస్సీ సొసైటీ : 149
మైనార్టీ సొసైటీ: 89
గిరిజన సొసైటీ : 40
సాధారణ సొసైటీ: 03