DQ – TS HISTORY-NIZAM DYNASTY

DQ – TS HISTORY-NIZAM DYNASTY

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

28 డైలీ క్విజ్ తెలంగాణ చరిత్ర, నిజాం పాలన కాలం

1. నిజాం కాలంలో సుభాలు అందులో ఉన్న జిల్లాలకు సంబంధించి తప్పుగా జతపరచినది ఏది
1) మెదక్ సుబా: నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ
2) వరంగల్ సుబా: వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్

2. 1948 నాటి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అయితే తెలంగాణ లో ఉన్న జిల్లాల్లో ఈ కింది వాటిల్లో లేనిది ఏదో గుర్తించండి
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మెదక్
4) ఖమ్మం
5) మహబూబ్ నగర్
6) రంగారెడ్డి

3. సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ?
1) సుబాకి అధిపతి - సర్దార్ తాలూక్ దార్
2) గ్రామాల్లో పన్ను వసూళ్ళు - పట్వారీ
3) గ్రామాల్లో శాంతిభద్రతలకు - తాలూక్ దార్

4. నిజాం పాలకులకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్
1) 1942లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు
2) బ్రిటీష్ భారత దేశంలో సొంత కరెన్సీ కలిగిన ఏకైక సంస్థానం జమ్ము కశ్మీర్
3) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రుపీ, ఉస్మానియా సిక్కా పేరుతో సొంత కరెన్సీని ముద్రించాడు
4) మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో రూ.100, రూ.1000 నోట్లు ఉండేవి

5. సాలర్జంగ్ కాలంలో విద్యాలయాల స్థాపన - వాటి ఉద్దేశ్యం
1) దారుల్ -ఉల్ -ఉలుమ్
2) ఇంజనీరింగ్ కళాశాల
3) మదర్సా-ఇ-ఆలియా
4) మదర్సా -ఇ -ఐజా

ఎ) ఇంగ్లీష్ పాఠశాల
బి) పబ్లిక్ వర్క్స్ శాఖ
సి) నవాబ్ ల పిల్లల కోసం
డి) రాచకుటుంబంలోని పిల్లల కోసం

6. నిజాం కాలంలో ప్రజల వాక్, సభా, పత్రికా స్వాతంత్ర్యాలను హరించివేయడానికి కారణమైన ఫర్మానా ఏది

7. భారత దేశంలోనే మొదటిసారిగా 1940లో ఎవరి కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం అయ్యాయి ?

8. నిజాం రాజుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం సుభాలను 4 విధాలుగా విభజించారు.
1) తహసిల్దార్ 2) అవ్వల్ తాలూక్ దార్ 3) సుబేదార్ 4) గ్రామాధికారులు
పైన పేర్కొన్న నాలుగు పదవుల్లో అధికారాలు ఎక్కువ కలిగిన వారి నుంచి తక్కువకు రాయండి

9. ఈ కింద పేర్కొన్న నిజాం రాజుల్లో కొందరు స్వయంగా కవులు. ఉర్దూ, పారశీక భాషల్లో రచనలు చేశారు. వారిని గుర్తించండి
1) నిజాం ఉల్ ముల్క్
2) నాసిర్ జంగ్
3) సికిందర్ జా
4) నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్
5) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

10. నిజాం పాలనా కాలంలో గ్రామ పరిపాలనాధికారులకు సంబంధించి తప్పుగా జతపరచినది ఏది
1) మాలీ పటేల్ - శిస్తు వసూలు
2) పోలీస్ పటేల్ - శాంతి భద్రతలు
3) నీరడి - చెరువులు, కాల్వల పర్యవేక్షణ
4) తలారీ - పొలాలు, పద్దులు

11. ఒకటో సాలార్జంగ్ సంస్కరణలు తీసుకు రాకముందు భూమి శిస్తు, ఇతర పన్నులు వసూలు చేసే అధికారాన్ని గుత్తకి ఇచ్చేవారు. దాన్ని ఏమని పిలిచేవారు