Tuesday, July 7

26 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోడానికి లింక్

26 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంద్రప్రదేశ్)

Friends,
వాట్సాప్ గ్రూపుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల (Limited members) పోస్టింగ్స్ ఇబ్బందిగా మారుతోంది. అందువల్ల గ్రూప్ 1 Aspirants టార్గెట్ గా మేం Telegram యాప్ లో కొత్త గ్రూప్ క్రియేట్ చేశాం. ఇందులో డైలీ న్యూస్ పేపర్స్ లో వచ్చే Important Articles తో పాటు.. Exclusive Polls, Daily Current Affairs, Daily Tests కూడా నిర్వహించబడును. అందువల్ల గ్రూప్ 1 తో పాటు ఇతర Competative Exams కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులెవరైనా ఈ గ్రూపులో జాయిన్ అవ్వగలరు. ఆ లింక్ ఈ కింద ఇస్తున్నాను. ఇందులో ఒకే గ్రూపులో 10 వేల మందికి పైగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. Telegram యాప్ లేనివారు Google Play store నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://t.me/group1aspirants_TelanganaExams
టెలిగ్రామ్ కరెంట్ ఎఫైర్స్ కోసం
https://t.me/tsexams_currentaffairs

1. తెలంగాణలో జీవరాశుల లెక్కకు సంబంధించి ఈ ప్రకటనల్లో సరైనవి ఏవి ?

1) జీవ రాశులను లెక్కగట్టేందుకు కాకతీయ యూనివర్సిటీకి చెందిన జువాలజీ విభాగం కసరత్తు చేస్తోంది

2) ఇండియన్ బయో డైవర్సిటీ నిబంధనలు 2004 ప్రకారం ప్రతి గ్రామంలో ఉన్న జీవరాలకు సంబంధించి బ్యాంక్ ఏర్పాటు చేయాలి

3) రాష్ట్రంలో ఇప్పటికే 3500 మొక్కలు, 1800 జంతువులు లేదా పక్షలకు సంబంధించిన డేటా బ్యాంక్ ఏర్పాటు చేశారు

4) రూసా నిధుల కింద ఉస్మానియా యూనివర్సిటీలో జీవ వైవిధ్య సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

2. అపర భగీరథుడు – సర్ ఆర్థర్ కాటన్ పుస్తకాన్ని ఏపీలోని రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు ?

3. విదేశీ ఉపగ్రహ మార్కెట్ పై ఇస్రో దృష్టి పెట్టింది.  ఇప్పటిదాకా 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలు నింగిలోకి పంపింది.  దాంతో ఐదేళ్ళల్లో రూ.1245 కోట్ల ఆదాయం గడించింది.  అయితే 1999 లో మొదటిసారిగా ఏ దేశానికి చెందిన DLR టబ్ సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్ ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ?

4. భూగర్భ జలాలను పెంచేందుకు ఉద్దేశించిన ఏ స్కీమ్ ను ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 2019 డిసెంబర్ 25నాడు ప్రారంభించారు ?

5. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల కోసం దేశంలో మొదటగా నిర్భంధ కేంద్రం (డిటెన్షన్ సెంటర్ )ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ?

6. దేశంలోనే మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ?

7. 2019 జులై – సెప్టెంబర్ (Q3) మధ్యకాలంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో ఏయే దక్షిణాది నగరాల్లో 23శాతం వృద్ధి నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా ఆసియా పసిఫిక్ క్యూ3-2019 ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ నివేదిక తెలిపింది ?

8. అరక్ న్యూక్లియర్ రియాక్టర్ ను ఇటీవల ఏ దేశంలో అభివృద్ధి చేస్తున్నారు ?

9. భారత్ నెట్ తో అనుసంధానమైన అన్ని గ్రామాల్లోనూ ఉచిత వైఫై సేవలు మార్చి 2020 వరకూ ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అందిస్తామని కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో ఇప్పటికే 1.3లక్షల గ్రామ పంచాయతీలను భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ తో అనుసంధానం చేశారు.  దీన్ని ఎన్ని గ్రామపంచాయతీలకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ?

10. ఫార్మా రంగం విస్తరణ, కొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి ( నిమ్జ్) హోదా ప్రతిపాదనకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది.  ఫార్మాసిటీ తెలంగాణలో ఎక్కడ ఉంది ?