Wednesday, August 5

25 FEB 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

1. స్వలింగ సంపర్కపు ఆరోపణలతో రాజీనామా చేసిన మలేసియా ప్రధాని ఎవరు ?

2. వరుసగా మూడో ఏడాది కూడా ESPN ఉత్తమ మహిళా క్రీడాకారిణి అవార్డు దక్కించుకున్న ఇండియన్ ప్లేయర్ ఎవరు ?

3. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆంట్రపెన్యూర్ అవార్దు 2019 కు ఎవరు ఎంపికయ్యారు ?

4. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో Sustainable Development Goals Conclave 2020  ఎక్కడ జరిగింది ?

5. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( PM కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా రైతుల కోసం మొబైల్ యాప్ ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు.  అయితే ఈ పథకం కింద రైతులకు ఏటా ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది ?

6. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ తో వస్తున్న సినిమాను కరణ్ జోహార్ నిర్మించనున్నారు.  ఇందులో గంగూలీ పాత్రను ఎవరు పోషించే అవకాశముంది ?

7. వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్న వారి కోసం ఉద్దేశించిన ఔట్ లుక్ అగ్రికల్చర్ కాన్ క్లేవ్ అండ్ స్వరాజ్ అవార్డ్స్ 2020 లో జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డు ఏ PACS కి దక్కింది ?

8. ఏపీలోని విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.సత్యవతికి అనువాద విభాగంలో 2019 సంవత్సరానికి సాహిత్య అకాడమీ లభించింది.  ఆమె రాసిన ఏ నవలకి ఈ అవార్డు లభించింది ?

9. తెలంగాణ రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది.  మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది ?

10. అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటిన్స్ స్కీమ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ?