Friday, October 30

24th SEPT CA QUIZ

1. టైమ్స్ మేగజైన్ ప్రతియేటా ఇచ్చే Most Influential People of 2020 లిస్టులో ప్రధాని నరేంద్రమోడీ, నటుడు ఆయుష్మాన్ ఖురానాతో పాటు బిల్కిస్ కి కూడా చోటు దక్కింది.  బిల్కిస్ ఢిల్లీలో జరిగిన ఏ ఆందోళనల సందర్భంగా వార్తల్లోకి ఎక్కింది ?

2. 2020-21 సంవత్సరానికి (జులై-జూన్) దేశంలో ఎన్ని మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు ?

3. భారత్ శాటిలైట్ సిస్టమ్ ను లక్ష్యంగా చేసుకొని 2007 నుంచి ఏ దేశం దాడులకు పాల్పడుతున్నట్టు అమెరికాలోని చైనా ఏరో స్పేస్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది ?

4. HDFC Life ఇటీవల ఏ బ్యాంక్ తో కార్పోరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ ను కుదర్చుకుంది ?

5. బాహ్ నడ్వా ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు ?

6. 23 సెప్టెంబర్ 2020 నాడు ఎయిమ్స్ లో కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయిన కేంద్ర మంత్రి సురేశ్ అంగడి ఏ శాఖను నిర్వహిస్తున్నారు ?

7. కరోనా వైరస్ వ్యాధి నివారణకు ముక్కు ద్వారా ఇచ్చే సింగిల్ డోస్ టీకా తయారీ కోసం సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ కంపెనీ ఏది ?

8. ఎథికల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీపై దేశంలోనే మొదటిసారిగా కొత్త పాలసీలను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం ఏది ?

9. ఆసియాన్ ఫుట్ బాల్ కన్ఫడరేషన్ (AFC) టాస్క్ ఫోర్స్ లో సభ్యుడిగా నియమితులైనది ఎవరు ?

10. శత్రు దేశాల యుద్ధ ట్యాంకులను పేల్చేసే లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను DRDO (Defense Research Development Organisation) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ఆర్ముడ్ కోర్ సెంటర్ అండ్ స్కూల్ లోని కేకే రేంజ్ దగ్గర విజవంతంగా ప్రయోగించింది.  అయితే ఈ మిసైల్ ను ఏ యుద్ధ ట్యాంక్ నుంచి ప్రయోగించారు ?


 

ఒక్క యాప్ తో - దేశంలోని అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు.... Telangana Exams Plus (Exclusively for Competitive Exams)

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp