Wednesday, August 5

24 FEB 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ఓపెన్ చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/24-feb-2020-current-affairs-quiz-ts-ap/

లేదా ఈ కింది లింక్ ద్వారా కరెంట్ ఎఫైర్స్ చదువుకోండి

https://andhraexams.com/24-feb-2020-current-affairs-ts-ap/

1. ముంబైలోని YRF స్టూడిలో జరిగిన మిస్ దివా యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించిన మంగళూరు అమ్మాయి ఎవరు ?

2. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించబోతున్నారు.  వీటిని  ఏ పేరుతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2015లో అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది ?

3. రిజర్వ్ బ్యాంక్ అకౌంటింగ్ ఇయర్ ను మార్చబోతున్నారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

ఎ) ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ ను ఏప్రిల్ నుంచి మార్చ్ వరకూ మార్చబోతున్నారు.  ఈ ఏడాది జులై నుంచి మొదలయ్యే ఇయర్ 2021 మార్చి 31తో ముగుస్తుంది

బి) 1935లో ఆర్బీఐ ఏర్పడినప్పుడు జనవరి టు డిసెంబర్ ఆర్థిక సంవత్సరంగా ఉండేది

సి) 1940లో దాన్ని జులై నుంచి జూన్ వరకూ మార్చారు.

డి) ఎకనమిక్ కేపిట్ ఫ్రేమ్ వర్క్ పై ఏర్పాటైన బిమల్ జలాన్ కమిటీ సూచనల మేరకే ఆర్బీఐ ఆర్థిక సంవత్సరంలో మార్పు చేస్తున్నారు

4. న్యాయవ్యవస్థ – మారుతున్న ప్రపంచం అనే అంశంపై అంతర్జాతీయ న్యాయ సదస్సు( ఇంటర్నేషనల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ ) ఎక్కడ జరుగుతోంది ?

5. పేదలకు పెద్ద చదువులు అందించే ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభిస్తున్నారు ?

6. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (FBI) వెల్లడించిన ఇంటర్నెట్ క్రైమ్ రిపోర్ట్ 2019 ప్రకారం సైబర్ నేరాల్లో అమెరికాని మినహాయిస్తే భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

7. భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి ఈ కింది అంశాల్లో సరైనవి ఏవి

ఎ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన కోసం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 2020 ఫిబ్రవరి 24నాడు చేరుకుంటారు

బి) అహ్మదాబాద్ లో ఇండియా రోడ్ షో పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.  అహ్మదాబాద్ నగరంలోని మోతెరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో కలసి ట్రంప్ పాల్గొంటారు

సి) అమెరికా నుంచి రూ.16,200 కోట్ల విలువైన 24 MH 60 రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశముంది

డి) రూ.5,600 కోట్లకు సంబంధించి ఆరు అపాచీ హెలికాప్టర్లు (AH-64E) కొనుగోలు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశముంది.

8. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, తిండి, మ్యూజిక్, ఎలా ఫిట్ గా ఉండాలి లాంటి 16 విలువైన అంశాలను నేర్పే గర్భ్ సంస్కార్ పేరుతో కొత్త కోర్సు ప్రవేశపెడుతున్న యూనివర్సిటీ ఏది ?

9. 2020 మార్చి 1 నుంచి లాటరీలపై ఎంతశాతం GST ని విధించనున్నారు ?

10. సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 11వ సీజన్ విజేతగా నిలిచిన బూట్ పాలిష్ వాలా ఎవరు ?

11. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్షిప్ లో 74 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచి ఒలింపిక్ క్వాలిఫయర్స్ కి అర్హత సాధించిన స్టార్ రెజ్లర్ ఎవరు ?

12. తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా 18 యేళ్ళు దాటిన మహిళలకు నాలుగేళ్ళుగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఒక్కోటి రూ.287ల విలువుగల  కోటికి పైగా చీరలను తయారు చేయబోతున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ?