Wednesday, October 23

23 SEPT CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకొని రాసుకోగలరు.

23 సెప్టెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. 2017-18 కి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) రిపోర్టును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం వల్ల అంచనాల వ్యయం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందని కాగ్ తెలిపింది.

2. న్యాట్ గ్రిడ్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?

1) ఉగ్రవాద దాడుల యత్నాలను సమర్థంగా తిప్పికొట్టేందుకు వీలుగా నేషనల్ ఇంటిగ్రేషన్ గ్రిడ్ (న్యాట్ గ్రిడ్ ) ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి తేనుంది

2) 2010లో రూ.3,400 కోట్లతో న్యాట్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది

3) 2008లో ముంబై ఉగ్రవాదుల దాడుల తర్వాత న్యాట్ గ్రిడ్ అవసరాన్ని గుర్తించారు.

4) న్యాట్ గ్రిడ్ డేటా రికవరీ కేంద్రాన్ని బెంగళూరులో నిర్మించారు.

3. హ్యూస్టన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కోసం నమో థాలి, నమో మిఠాయి థాలిని అందించిన ఒడిశాకి చెందిన చెఫ్ ఎవరు ?

4. రష్యాలోని స్కోల్ కోవోలో జరిగిన మహిళల గ్రాండ్ ప్రి సరీస్ 2019-20 సీజన్ కు తొలి టోర్నీలో విజేత ఎవరు నిలిచారు ?

5. క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు సూటిగా నేరుగా, సమర్థవంతంగా ఆ కణాలనే టార్గెట్ చేసేలా మాలిక్యులర్ డ్రిల్లింగ్ పరికరాన్ని కనుగొన్న భారతీయ మహిళ ఎవరు ?

6. ఆంధ్రప్రదేశ్ లో 2019 డిసెంబర్ 15లోగా 3,786 చోట్ల గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు.  అక్టోబర్ 2 నాడు ఎన్ని వార్డు సచివాలయాలు ప్రారంభం అవుతున్నాయి ?

7. భారత్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.  దీంతో సిరీస్ ను ఎవరు గెలుచుకున్నారు ?

8. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి కమిటీలను ప్రకటించారు. కమిటీలు ఛైర్మన్లు జతపరచండి

1) అక్బరుద్దీన్

2) సోలిపేట రామలింగారెడ్డి

3) ఆశన్నగారి జీవన్ రెడ్డి

4) నన్నపునేని నరేందర్

 

ఎ) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ

బి) పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ

సి) పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ

డి) దక్షిణ మధ్య రైల్వే జోన్ యూజర్స్

9. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత యువ కెరటం దీపక్ పునియాకి స్వర్ణం దక్కలేదు. 86 కేజీల విభాగంలో గాయం కారణంగా తప్పుకున్న పునియాకి ఏ పతకం దక్కింది ?

10. అమెరికాలోని హ్యస్టన్ లో భారీగా NRI లు పాల్గొన్న హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.  ఇది నిర్వహించిన స్టేడియం ఏది ?

11. హైదరాబాద్ లోని శంషాబాద్ దగ్గర నుంచి ఎయిర్ పోర్ట్ టెర్మినల్ వరకూ ఎన్ని కీలోమీటర్ల దూరం వరకూ భూగర్భ మెట్రో రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ?