Tuesday, July 7

23 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ కరెంట్ ఎఫైర్స్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

23 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంద్రప్రదేశ్ )

1. 2019 నవంబర్ 17 నుంచి 21 వరకూ జైర్ –అల్ –బహర్ పేరుతో మొదటిసారిగా సంయుక్తంగా ద్వైపాక్షిక నౌకా విన్యాసాలు ఏయే దేశాల మద్య జరిగాయి ?

2. ఇండియా టుడే నిర్వహించిన  స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్ క్లేవ్ – 2019 లో సపరిపాలన (గుడ్ గవర్నెన్స్ ) అవార్డు అందుకున్న రాష్ట్రం ఏది ?

3. క్లయింట్ల షేర్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఏ ప్రముఖ సంస్థ స్టాక్ బ్రోకింగ్ పై మార్కెట్ నియంత్రణాధికార సంస్థ (సెబీ) నిషేధం విధించింది ?

4. దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు 2019 నవంబర్ 15 ముగిసే వారానికి లైఫ్ టైమ్ హయ్యస్ట్ కు చేరుకున్నాయి.  ప్రస్తుతం ఎన్ని కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ?

5. తెలంగాణలో రాష్ట్ర` స్థాయి సివిల్ సర్వీసెస్ ఏర్పాటుకు మూడేళ్ళ క్రితం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ?

6. వచ్చే ఆరేళ్ళలో దేశంలోని మౌలిక రంగంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

7. చెరకు పండించే రైతుల కోసం ఈ- గన్న యాప్ అనే మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?

8. 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు ?

9. పాకిస్తాన్ – భారత్ సరిహద్దుల్లో థార్ ఎడారి దగ్గర్లో దాదాపు 3 వేల నుంచి – 2500 యేళ్ళ నాటి ఇనుప యుగపు జనావాసాలు ఉన్నట్టు IIT ఖరగ్ పూర్ పరిశోధకులు గుర్తించారు.  ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

10. గులాబీ రంగు బంతితో భారత్ – బంగ్లా దేశ్ మధ్య మొదటి డే అండ్ నైట్ మ్యాచ్ ఏ క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది ?