Monday, March 30

23 & 24 MARCH 20 CURRENT AFFAIRS QUIZ ( TS)

1. కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు 23 మార్చి 2020 నాడు ముగిశాయి.  కొమురవెల్లి ఏ జిల్లాలో ఉంది ?

2. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటంతో ఏ దేశంలో జరిగే ఒలింపిక్స్ ను 2021 వాయిదా వేయాలని భావిస్తున్నారు ?

3. ప్రపంచంలోనే మొదటిసారిగా కేంద్రబ్యాంక్ ఆర్బీఐ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది.  కరోనా వైరస్ విస్తృతితో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఈ ఏర్పాటు చేసింది.  ఈ వార్ రూమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?

4. వైరస్ తో విలవిల్లాడుతున్న అమెరికాకు తన వంతు సాయంగా 38 కోట్ల రూపాయలను అందించిన పాప్ గాయని ఎవరు ?

5. దేశంలో రిలయన్స్ సంస్థ మొదటిసారిగా 100 పడకలతో కోవిడ్ 19 హాస్పిటల్ ను ఏర్పాటు చేయడంతో పాటు మాస్కులను భారీగా తయారు చేసేందుకు ముందుకు వచ్చింది.  ఈ హాస్పిటల్ ను ఎక్కడ ఏర్పాటు చేసింది ?

6. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ 2020 మార్చి 23 రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు.  సీఎంగా ఆయన ఎన్నోసారి బాధ్యతలు చేపట్టారు ?

7. దేశంలో బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్ ప్రొడక్షన్ పెంచేందుకు ఎన్ని కోట్ల రూపాయలతో ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?

8. ఏడేళ్ళలోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైళ్ళల్లో ఉన్న ఖైదీలందర్నీ పెరోల్ పై విడుదల సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.  దేశవ్యాప్తంగా ఎన్ని జైళ్ళల్లో 4,66,084 మంది ఖైదీలు ఉన్నారు ?

9. తెలంగాణలో లాక్ డౌన్ సందర్భంగా రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీని 2020 మార్చి 24 నుంచి ఏయే జిల్లాల్లో మొదలుపెడుతున్నారు.

10. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి 2020 మార్చి 23 వరకూ ఎన్ని రాష్ట్రాలు / యూటీలకు ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం విస్తరించింది ?

11. కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ ప్రకటించడంతో తెలంగాణలో తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12కేజీల బియ్యంతో పాటు ఎంత మొత్తం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?