Wednesday, January 20
Shadow

21 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS)

1. 50యేళ్ళ పాటు భారత్ ఫుట్ బాల్ క్రీడాకారుడిగా, కెప్టెన్ గా, కోచ్ గా భారత్ కు సేవలు అందించిన దిగ్గజం చనిపోయారు.  ఆయన పేరేంటి ?

2. 2019-20 లో 118 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన పోర్టు ఏది ?

3. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో 7 జాతీయ, 25 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.6,405.59 కోట్ల విరాళాలు వసూలు చేసినట్టు ప్రజాసామ్య సంస్కరణల వేదిక ( ADR) సంస్థ వెల్లడించింది.  పార్టీలు – విరాళాలు జతపరచండి

1) బీజేపీ

2) కాంగ్రెస్

3) వైసీపీ

4) తృణమూల్

5) టీఆర్ఎస్

 

కోట్ల రూపాయల్లోఎ) 4,057.40

బి) 1,167.14

సి) 221.58

డి) 141.09

ఇ) 129.26

4. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) కి భారత్ వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ సంస్థ ఫిచ్ ఎంతగా నమోదవుతాయని అంచనా వేసింది ? (గతంలో 5.6శాతంగా పేర్కొంది)

5. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఆ పార్టీ బలం 92కి పడిపోయింది.  ఇప్పుడు సభలో మొత్తం సభ్యుల సంఖ్య 222కి తగ్గింది.  అయితే అసలు మధ్యప్రదేశ్ లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి ?

6. ఒంటరిగా ఉన్న తమ పిల్లల బాగోగులు చూసుకుంటున్న పురుష ఉద్యోగులకూ రెండేళ్ళ సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించిన శాఖ ఏది ?

7. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కీలక కార్యాలయాల లీజింగ్ లో ఆసియా పసిఫిక్ రీజియన్ లో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది ? (నెట్ ఫ్రాంక్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది )

8. 2020 ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ విధానం అమల్లోకి రానుంది.  దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించినది టీఎస్ బీపాస్ విధానం

2) 75 చదరపు అడుగుల లోపు నిర్మాణాలకు ఆన్ లైన్లో రిజిష్టర్ చేసుకుంటే సరిపోతుంది

3) ప్లాట్ విస్తీర్ణం 500 చదరపు మీటర్లు లేదా 10 మీటర్ల ఎత్తు మేరకు నిర్మించే భవనాలకు దరఖాస్తుదారుడు స్వీయ ధృవీకరణతో అప్లయ్ చేసుకుంటే వెంటనే అనుమతి ఇస్తారు

4) 10మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించే భవనాలు, నివాసేతర భవనాలకు సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో ఇస్తారు. 21 రోజుల్లో అనుమతి రాకుంటే 22 వ రోజున ఆన్ లైన్ లో అనుమతి పత్రం ఆటోమేటిగ్గా వస్తుంది

9. దేశంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించిన డేటా ప్రకారం ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) గడచిన ఐదేళ్ళల్లో దేశంలో రైతులు ఆత్మహత్యలేవీ నమోదు కాలేదు

2) 2014-18 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 31,645 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు

3) మొత్తం ఆత్మహత్యల్లో 99.51 శాతం 13 రాష్ట్రాల్లోనే జరిగాయి

4) అత్యధికంగా మహారాష్ట్రలో 12,813 మంది, కర్ణాటకలో రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానం (4,634 మంది), ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం ( 1655మంది ) నిలిచాయి

10. 2020 మార్చి 20 నాడు నిర్భయ్ అత్యాచారం కేసులో నలుగురు దోషులకు తిహార్ జైల్లో ఉరి తీశారు.  ఈ సంఘటన ఢిల్లీలో 2012 డిసెంబర్ 16 రాత్రి జరిగింది.  అయితే ఇంతకుముందు భారత్ లో ఎవరిని చివరిసారిగా ఉరి తీశారు ?