Monday, March 30

21 FEB CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ కింది లింక్ ద్వారా క్విజ్ ను వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

http://telanganaexams.com/21-feb-current-affairs-quiz-ts-ap/

1. భారత్ లో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఏటా 1.50 లక్షల మంది చనిపోతున్నట్టు 7.5 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.  దీంతో ఏడాదికి జీడీపీలో ఎంత నష్టం జరుగుతుందని అంచనా వేసింది ?

2. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, వారసత్వాన్ని, ఆచారాలను సంరక్షించే ఏ ఆర్టికల్ ను రద్దు చేసే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ?

3. ప్రభుత్వ రంగ సంస్థలకు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ వాటి సంస్థాగత విలువను పెంచడంతో పాటు వాటాదార్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కృషి చేసిన వారికి ఏటా బిజినెస్ లీడర్షిప్ అవార్డులను ఇస్తారు. ఢిల్లీలో జరుగుతున్న 7వ PSU అవార్డు ప్రధాన కార్యక్రమంలో తెలంగాణలో ఈ అవార్డు అందుకున్న NMDC CMD ఎవరు ?

4. 2020-21 కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన అత్యధిక ఆదాయంపన్ను స్లాబ్ ఎంత ?

5. సిస్టమ్, లేదా మొబైల్ లో కట్, కాపీ, పేస్ట్ గురించి అందరికీ తెలుసు.  అయితే దీన్ని సృష్టించిన కంప్యూటర్ సైంటిస్ట్ చనిపోయారు. ఆయన పేరేంటి ?

6. ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాల్లలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి, నాడు-నేడు పథకానికి 1048.82 కోట్ల రూపాయలను మంజూరు చేసిన బ్యాంక్ ఏది ?

7. 2020 ఫిబ్రవరి నుంచి ఈ కింది ఏ వస్తువులను GST నుంచి మినహాయించారు ?

8. మన సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర జలాలను మరింత పకడ్బందీగా రక్షించేందుకు 27 నెలల్లోనే రీఫిట్టింగ్ చేసి  ఏ జలాంతర్గామిని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తిరిగి నేవికి అప్పగించింది ?

9. కరోనా ప్రభావం జూన్ తర్వాత కూడా కొనసాగితే ప్రపంచ వృద్ధి రేటు ఎంతవరకూ క్షీణించే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ నివేదిక వెల్లడించింది ?

10. GMR గ్రూపు సంస్థ అయిన GMR ఎయిర్ పోర్ట్స్ లిమిలెడ్ ( GAL) లో 49శాతం వాటాను రూ.10,780కోట్లతో సొంతం చేసుకున్న ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ గ్రూపే ADP సంస్థ ఏ దేశానికి చెందినది ?


 

అన్ని మాక్ టెస్టులకీ ఒకే ఫీజు @ Rs.1000/-(One Yr Subscription)Last date extended to 23rd Sunday

http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/