Tuesday, November 13
Log In

2019లోనూ ఎంసెట్ !?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి ఇంకా స్పష్టత లేదు. ఏడాదిలో రెండు సార్లు JEE నిర్వహణ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఎంసెట్ స్థానంలో JEE లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాలకి క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో 2019లో కూడా ఎంసెట్ నిర్వహించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మార్కుల నుంచి 20శాతం వెయిటేజ్ ఉంది. ఒకవేళ JEE ద్వారా నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే 20శాతం వెయిటేజ్ మాటేంటి అన్నదానిపై క్లారిటీ లేదు. అందువల్ల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి మళ్ళీ ఆదేశాలు వచ్చే వరకూ ఎంసెట్ కంటిన్యూ కానుంది. ప్రస్తుతం యూజీసీ నెట్, నీట్ లాంటి పరీక్షల నిర్వహణను NTA నిర్వహిస్తోంది. రాష్ట్రాల్లోని ఉన్నత విద్య శాఖకి ఈ సంస్థతో సమన్వయం కష్టమవుతుంది. ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యా మండలి క్లారిటీ ఇవ్వకపోతే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయని అంటున్నారు విద్యానిపుణులు.