Sunday, February 23

20 JAN 2020 CURRENT AFFAIRS (TS & AP)

వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోడానికి లింక్

20 జనవరి 2020 కరెంట్ ఎఫైర్స్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి.  తెలంగాణలో కొమురవెల్లి ఏ జిల్లాలో ఉంది ?

2. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (PBL) ఐదో సీజన్ ఇవాళ ఎక్కడ ప్రారంభమవుతోంది ? ( మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ హంటర్స్ (పీవీ సింధు), చెన్నై సూపర్ స్టార్స్ (గాయంత్రి గోపీచంద్) మధ్య మ్యాచ్ జరగనుంది )

3. 2020 జనవరి 21 నుంచి 24 వరకూ స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగే  ప్రపంచ ఆర్థిక వేదిక 50వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళ్తున్న మంత్రి ఎవరు ?

4. బ్రిటన్ రాజరికపు విధుల నుంచి హ్యారీ, ఆయన భార్య మేఘన్ మెర్కెల్ తప్పుకోనున్నారు.  ఇకపై వారికి హిస్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్ అనే బిరుదులు ఉండవు.  ఏటా బ్రిటన్ ప్రభుత్వం రాచరిక కుటుంబానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఎన్ని పౌండ్లను కేటాయిస్తోంది ( ఈ మొత్తాన్ని అందుకోడానికి వీరికి అర్హత లేదు)

5. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 50వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో 2020 జనవరి 20 నుంచి ప్రారంభమవుతోంది.  ఈ సందర్భంగా ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదిక పేరుతో తాజా అధ్యయనాన్ని వెల్లడించింది.  తాము పరిశీలించిన మొక్కలు, జంతువుల జాతుల్లో దాదాపు ఎంత శాతం మానవ కార్యకలాపాల కారణంగా అంతరించే ముప్పు ఎదుర్కొంటున్నట్టు నివేదిక ప్రకటించింది ?

6. జలంతర్గాముల నుంచి ప్రయోగించే K4 బాలిస్టిక్ క్షిపణిని DRDO అధికారులు 2020 జనవరి 19 నాడు విశాఖ తీరానికి సుదూర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.  ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది ?

7. భారత్ లో ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాల్లో 11వ వంతును జారీ చేయడానికి ఈ కింది వాటిల్లో ఏ బ్యాంకుకు అధికారం ఉంది ?

8. పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా 5.17 కోట్ల మందితో కలసపి 2020 జనవరి 19 నాడు ఏ రాష్ట్రంలో భారీ మానవ హారం జరిగింది ? ( ఈ చైన్ దాదాపు 18,034 కిలో మీటర్ల పొడవు ఉంది)

9. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మ్యారిటైం సెక్యూరిటీ కోసం భారత్ నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ?

10. బడ్జెట్ పరిభాషపై సామాన్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆర్థికశాఖ 2020 జనవరి 22 నుంచి సోషల్ మీడియాలో ఏ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది ?