Friday, October 30

20 AUGUST CURRENT AFFAIRS QUIZ

1. దేశంలోని అన్ని జన నివాస పరాంతాలను 2019 డిసెంబర్ 31 నాటికి జనాభా లెక్కల విభాగం అధికారికంగా గుర్తించింది.  అయతే జనగణ గడువును ఎప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది ?

2. RRB ,SSC, IBPS  సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలకి కలిపి ఒకే టెస్ట్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే వచ్చే మూడేళ్ళ కోసం NRA కి ఎంత మొత్తం బడ్జెట్ ను  కేటాయించారు ?

3. కరోనా సంక్షోభంతో భారత వృద్ధి అంచనాలను మరింత తగ్గించే అవకాశముందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.  అయితే 2020-21 లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం క్షీణిస్తుందని గతంలో వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది ?

4. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ద ఇండస్ ఎంటర్ ప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ విభాగం పెద్ద వర్చువల్ వరల్డ్ కాన్ఫరెన్స్ ను (హైదరాబాద్ వేదికగా) ఎప్పుడు నిర్వహించనుంది ?

5. ఏ దేశంలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు ఆస్ట్రాజెనికా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రధాని స్మాట్ మోరిసన్ ప్రకటించారు ?

6. హెల్త్ అండ్ న్యూట్రీషియన్ కు సంబంధించి కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖా రిలీజ్ చేసిన E-news letter పేరేంటి ?

7. జపాన్ కు చెందిన ఫ్యూజీ ఫిల్మ్ టయామా కెమికల్ కంపెనీ తయారు చేసిన అవిగన్ బ్రాండ్ పేరుతో కరోనా పేషెంట్లకి ఇచ్చే ఫావిపిరవిర్ మెడిసన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన భారతీయ కంపెనీ ఏది ?

8. బియ్యం కార్డు ఉండి కుటుంబంపై ఆధారపడ్డ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి వైఎస్సార్ బీమా కింద పరిహారం చెల్లించేందుకు కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది.  ఏపీలో 1.50 కోట్ల కుటుంబాలకి ఈ బీమా వర్తించనుంది.  అయితే కుటుంబ యజమాని చనిపోతే ఎంత మొత్తాన్ని బీమా కింద చెల్లిస్తారు ? (18 నుంచి 50 యేళ్ళ లోపు వారికి వర్తింపు )

9. చర్మం ద్వారా వ్యాధి నిరోధక శక్తికి ఉపయోగపడేందుకు ఆయుర్వేద మూలికలతో ఏ రాష్ట్రానికి చెందిన చేనేత కళాకారులు ఔషధ చీరలను తయారు చేశారు ?

10. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను కలిగిన మొదటి అమెరికా సంస్థగా అవతరించిన టెక్ దిగ్గజం ఏది ?