70వేలు కాదు… లక్ష కొలువులు ?

70వేలు కాదు… లక్ష కొలువులు ?

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఈ ఉద్యోగాల ప్రకటన చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి ఉద్యోగాల కేలండర్ ను అమలు చేస్తారని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో 70 వేల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలకు కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త నియామకాలకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా 2022-23 బడ్జెట్ లో ప్రభుత్వం రూ.4వేల కోట్లను కేటాయించింది. ఇప్పుడు లక్ష ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు... వివిధ శాఖల రిక్రూట్ మెంట్ బోర్డులు కూడా నియామకాలు చేపట్టనున్నాయి. TSPSC కాకుండా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, గురుకులా రిక్రూట్ మెంట్ బోర్డు, పంచాయతీ రాజ్ సర్వీసెస్ నియామక మండలి, సింగరేణి రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో జోనల్ విధానం అమలు చేసి ఉద్యోగుల బదిలీలు చేయడంతో మరికొన్ని కొత్త పోస్టులు బయటపడ్డాయి. PRC కమిషన్ రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గతంలో వెల్లడించింది. ప్రతిపక్ష నేతలు మాత్రం మొత్తం 2 లక్షలకు పైగానే కొలువులు ఉన్నాయనీ అన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రూప్ 1 & 2 పోస్టులు కూడా

రాష్ట్రం ఏర్పడ్డాక గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ ను ప్రభుత్వం ఇంతవరకూ చేపట్టలేదు. అందుకే ఈసారి పోస్టుల భర్తీలో గ్రూప్ 1 పోస్టులతో పాటు... గ్రూప్ 2 ఇంకా ఇప్పటికే గుర్తించిన గ్రూప్ 3 పోస్టులు కూడా భర్తీ చేస్తారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా పోలీస్ కానిస్టేబుల్స్ (18వేలు ఉన్నట్టు సమాచారం), వెయ్యి దాకా సబ్ ఇన్సెపెక్టర్ పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి.

టీచర్ల రిక్రూట్ మెంట్ కీ ఛాన్స్

రాష్ట్రంలో గురుకులాల్లోనే 18 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇప్పుడు మన ఊరు మన బడి ప్రోగ్రామ్ లో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రభుత్వం స్కూళ్ళల్లో ప్రవేశపెడుతున్నారు. అందువల్ల టీచర్ల పోస్టుల భర్తీకి అవకాశాలున్నాయి. మొత్తం 25 వేల పోస్టులు అవసరమని భావిస్తున్నారు. అలాగే పాఠశాలల ఫీజుల కమిటీ టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాంతో TRT రిక్రూట్ మెంట్ కంటే ముందుగా టెట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఉదయం 10 గంటలకు ప్రకటన

ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ శాసనసభలో కొలువుల భర్తీపై ప్రకటన చేయనున్నారు. అయితే బడ్జెట్ లో కేటాయింపులు జరపనందున నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారా లేదా అన్నది డౌట్ గా ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష కొలువులను మాత్రం క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసే అవకాశాలున్నాయి. గతంలో ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు పడటంతో నిరుద్యోగులు సరిగా ప్రిపేర్ అవ్వలేక ఇబ్బందులు పడ్డాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరుతున్నారు.

 

కోర్సుల్లో జాయిన్ అవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ ! 

http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/