1990లో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వ్యవసాయ సంక్షోభం

1) ప్రపంచంలోనే మొదటిసారిగా పారిశ్రాకీకరణ సాధించిన దేశం ఏది?
జ) ఇంగ్లండ్.
2) ఎపిజెన్ కో ఎపిట్రాన్స్ కోలు ఎప్పుడు ఆవిర్బవించాయి.?
జ) 1999 ఫిబ్రవరి 1.
3) కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ యెుక్క సామర్ద్య్యం ఎంత?
జ) 700 మెగావాట్లు.
4) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది?
జ) 1989.
5) ఎన్.టి.పి.సి.కి ఎన్ని సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి?
జ) 14.
6) తెలంగాణ జీవితానికి గుండెకాయ లాంటిదని పేర్కొన్న సంస్ద ఏది?
జ) సింగరేణి కాలరీస్ కంపెనీ.
7) సింగరేణి గనలు ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రవేశపెట్టింది?
జ) ఓపెన్ కాస్ట్.
8) జోనల్ వ్యవస్ద ఎప్పుడు ప్రారంభమయింది?
జ) 1974
9) సింగరేణి కాలరీస్ కంపెనీలో తెలంగాణ వాటా ఎంత ?
జ) 51 శాతం
10) మధ్యయుగంలో ఎవరెవరి మద్య శత్రుత్వం ఏర్పడింది ?
జ) యాదవులు మరియు కాకతీయులు.
11) చెరువులు ఎప్పుడు అంతరించిపోయాయి ?
జ) 1956 తరువాత
12) వి.ఆర్.వోలను ఎప్పుడు నియమించారు ?
జ) 1983-84.
13) గొలుసు చెరువుల విధానం ఎప్పటి నుండి అమలులో ఉండేది ?
జ) కాకతీయుల కాలం.
14) ఆర్దిక సంస్కరణలు ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
జ) 1995.
15) బషీర్ బాగ్ వద్ద పోలీస్ ఫైరింగ్ ఎప్పుడు జరిగింది?
జ) 2000 ఆగస్టు 28.
16) రైతుల ఆత్మహత్యలపై ఏ కమిటీ ఏర్పాటు చేయబడింది?
జ) జయంతి ఘోష్.
17) ఏ ఇరిగేషన్ లు ఆంధ్రాకే పరిమితమయినాయి?
జ) డ్రిప్ ఇరిగేషన్,స్ప్ర్రిక్లింగ్ ఇరిగేషన్.
18) చేనేత పరిశ్రమకు ప్రసిద్ది చెందిన ప్రాంతాలు ఏవి?
జ) సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్.
19) బీడీలు చుట్టేకార్మికులను ఏమని పిలుస్తారు?
జ) రోలర్స్.
20) మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు ?
జ) వ్యవసాయరంగం
21) ఏ ముఖ్యమంత్రి హయాంలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు ?
జ) చంద్రబాబు నాయుడు
22) విజన్ 2020 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏయే రంగాలను నిర్లష్యం చేసింది ?
జ) వ్యవసాయం, చేనేత
23) ఆంధ్రప్రదేశ్ లో హరితవిప్లవం కారణంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించిన ప్రాంతం ఏది ?
జ) కోస్త ఆంధ్ర
24) 1991లో రాష్ట్ర బడ్జెట్ లో రుణాల భారం ఎంత ?
జ) 48 కోట్లు
25) జాతీయ చేనేత కార్మికుల దినం ఎప్పుడు జరుపుకుంటారు ?
జ) ఆగస్టు 7
26) చేనేత రంగంలో మొదటి, ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి ?
జ) పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు
27) 1991 తెలంగాణలో కాలువల ద్వారా సాగునీరు విస్తీర్ణం ఎంత ?
జ) 3,52,382 హెక్టార్లు
28) 1980-90 సంవత్సరం పూర్తిగా ఏ విధానలలో కొత్త నమూనాన్ని రూపొదించింది ?
జ) సరళీకృతం.
29) రాష్ట్రంలో సాగైన భూమిలో 40%  తెలంగాణలో ఉంటే ఆ ప్రాంతానికి ఎంత శాతం రుణాలు అందేవి ?
జ) 23.27%
30) భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత సరళీకృత విధానాలు అమలు అయ్యేనాటికి ఏ పరిశ్రమ క్షీణిస్తూ వచ్చింది ?
జ) చేనేత పరిశ్రమ.