Monday, October 15
Log In

మరో 1917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 1917 పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటనలు జారీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. 2016-17 సం.నికి సంబంధించి TSPSC వార్షిక నివేదికను గవర్నర్ నరరసింహన్ కు అందించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టులకు సంబంధించి వివరాలు తెలిపారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పోస్టులన్నింటికీ ఈ డిసెంబర్ లోగా నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మొత్తం 40,921 పోస్టల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా మొత్తం 30,204 పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇచ్చామన్నారు. వీటిల్లో 12,749 పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. మరో 20,360 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ దశలో ఉందని ఘంటా చక్రపాణి వివరించారు.