Thursday, October 1

18 MARCH 2020 CURRENT AFFAIRS (TS)

ALSO READ :  MADE DIGITAL CONSULTANTS ! నెలకు కనీసం రూ.25 వేలు సంపాదించే ఛాన్స్ !!

1. దేశీయంగా తయారైన తేలికైన యుద్ధ విమానం తేజస్ ఫైనల్ పరీక్షలను ఎదుర్కొంది.  హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2020 మార్చి 17నాడు ఈ విమానాన్ని 40 నిమిషాల పాటు ఎక్కడ ప్రయోగించారు ?

2. దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడంలో పురుషుల వేసక్టమీలో (1.6శాతం) తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ?

3. ఆసియా, ఆఫ్రికా చిరుత పులులది ఒకే జాతి కాదని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ( CCMB) పరిశోధనలో వెల్లడించారు.  ఆసియా, ఆఫ్రికా చిరుతలు దాదాపు 50 నుంచి లక్ష యేళ్ళ మధ్య వేరుపడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు.  హైదరాబాద్ లో ఉన్న CCMB డైరెక్టర్ ఎవరు ?

4. హోమ్ క్యారెంటైన్ లో ఉండాల్సిన వారి చేతులపై ‘‘హోం క్యారంటైన్డ్ ’’ అనే స్టాంపును వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?

5. దేశ విభజన సమయంలో వదిలి వెళ్లిన ఆస్తులు దేశ వ్యాప్తంగా 12,426 ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  అయితే దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో 5,936 ఆస్తులు ఉన్నాయి ?

6. మహిళల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడంలో ఆ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ?

7. తెలంగాణలో ఎప్పటిలోపు తీసుకున్న రూ.1లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?

8. కుటుంబ నియంత్రణకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

  1. జాతీయ స్థాయిలో మహిళలల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శాతం – 36శాతం
  2. కుటుంబ నియంత్రణలో 69.4శాతంతో ఏపీ మొదటి స్థానంలో, 12.7శాతంతో మణిపూర్ చివరి స్థానంలో ఉంది
  3. వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య తెలంగాణలో 1.6శాతం ఉంది. జాతీయ సగటు కంటే 0.3శాతం ఎక్కువ

9. నౌకాదళంలో మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా  3 నెలల్లో విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.  గతంలో ఎన్నేళ్ళ వరకూ గరిష్టంగా సర్వీసులో కొనసాగడానికి అర్హత ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ లోని మహిళాధికారులు ఇప్పుడు పదవీ విరమణ వయసు వరకూ సర్వీసులో కొనసాగవచ్చు ?

10. కరోనా విజృంభిస్తుండటంతో 2020 సంవత్సరానికి భారత్ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత శాతంగా ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది ?


 

TELANGANA EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=www.telanganaexams.com

మాక్ టెస్టులు రాస్తున్న వాళ్ళు TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చు (ప్రతి సారీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సిన పనిలేదు)

TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=tsexams.com

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com