Saturday, August 15

18 DEC CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో క్విజ్ ఓపెన్ చేసుకోగలరు

18 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

(నోట్: ఈనెలలో మిస్ అయిన కరెంట్ ఎఫైర్స్ ను వచ్చే సోమవారం లోపు పోస్ట్ చేస్తాను. Pl cooperate. Tq)

1. ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను 2019 డిసెంబర్ 17నాడు ఒడిశా చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మూడో లాంచ్ కాంప్లెక్స్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్టు DRDO ప్రకటించింది.  అయితే ఈ బ్రహ్మోస్ యొక్క టార్గెట్ ఎన్ని కిలోమీటర్లు ?

2. ప్రపంచ ఉత్తమ జూనియర్ రెజ్లర్ ( జూనియర్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ ఆఫ్ ద ఇయర్ ) గా ఎంపికైన భారతీయ రెజ్లర్ ఎవరు ? ( యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వార్షిక అవార్డుల్లో ఈ గౌరవం దక్కింది )

3. పాకిస్తాన్ లో రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడిన ఆరోపణలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించింది.  ఏ ఏడాదిలో ముషారప్ తిరుగుబాటు చేశారు ?

4. నేపాల్, భారత్ మధ్య ఇటీవల ముగిసిన సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటి ?

5. టెలికాం సంస్థల ఇంటర్ కనెక్ట్ యూసేజీ ఛార్జీలు (IUC) విధానాన్ని ఎప్పటిదాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయించింది ?

6. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 రైల్వే స్టేషన్లకు ప్రతిష్టాత్మక ISO 14001:2015 సర్టిఫికేషన్ గుర్తింపు లభించింది. ఏ రంగంలో అనుకూల విధానాల ఆధారంగా ఈ గుర్తింపు లభించింది ?

7. ద హిందూ యూనిటీ మూవ్ మెంట్ (HUM) పేరుతో రామ్ మహారాజ్ ఏ దేశంలో రాజకీయ పార్టీని స్థాపించారు ?

8. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఎప్పటి లోగా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో ఆవిష్కరించారు ?

9. మహిళా సమానత్వంలో ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంతగా నమోదైంది ?

10. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన వార్షిక వన్డే, T20 జట్లలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా క్రికెటర్/ క్రికెటర్స్ ఎవరు ?