15 NOV CURRENT AFFAIRS ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

15 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. వర్జీనియా పొగాకు సాగులో సుస్థిర కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ పొగాకు బోర్డుకి టుబాకో రిపోర్టర్ అనే అంతర్జాతీయ మేగజైన్ నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో నిర్వహించిన టావ్ ఎక్స్ పో 2019లో అవార్డు ప్రదానం చేసింది.  ఆ అవార్డు పేరేంటి ?

2. మానవ హక్కుల రక్షణ, ప్రచారంపై అవగాహన కల్పించేందుకు తీసిన షార్ట్ ఫిల్మ్స్ కి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) అవార్డులు ప్రకటించింది.  2019 సంవత్సరానికి మొత్తం 88 షార్ట్ ఫిల్మ్స్ పోటీ పడ్డాయి. వీటిల్లో 3 చిత్రాలను ఎంపిక చేసింది.  ఉత్తమ పురస్కారం దక్కించుకున్న షార్ట్ ఫిల్మ్ ఏది ?

3. 2019 భారత్ వృద్ధి రేటు అంచాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మరోసారి కోత విధించింది.  గతంలో GDP 5.8శాతం నమోదు కావొచ్చని తెలిపింది. ఇప్పుడు ఎంతగా నిర్ణయించింది ?

4. ముంబైకి చెందిన టాటా స్టార్ బక్స్ తో కలసి  పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన An Extreme Love of Coffee అనే పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించారు.  దీన్ని రాసింది ఎవరు ?

5. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై దింపడంలో చంద్రయాన్ 2 విఫలం కావడంతో... చంద్రయాన్ 3 ని ఎప్పుడు చేపట్టే అవకాశం ఉన్నట్టు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు ?

6. భారత్ అమెరికా దేశాల త్రివిధ దళాలు నిర్వహిస్తున్న విన్యాసాలను భారత్ లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ విశాఖపట్నంలోకి తూర్పు నౌకాదళం జెట్టీ దగ్గర INS జలాశ్వ యుద్ధనౌకపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ విన్యాసాల పేరేంటి

7. దేశంలోని 3 తీరప్రాంత రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా) గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద 43మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి.  ఈ ఫండ్ ను జారీ చేసే అంతర్జాతీయ సంస్థ ఏది ?

8. తెలంగాణలో కొత్త పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి సరైనవి ?

1) GHMC పరిధిలో కార్పోరేటర్ కు ఎన్నికల  వ్యయం గరిష్ట పరిమితి : రూ.5లక్షలు

2) ఇతర నగరపాలక సంస్థల్లో కార్పోరేటర్ల ఎన్నికల వ్యయం: రూ.1.5లక్షలు

3) మున్సిపాలిటీ కౌన్సిలర్లకు రూ.1.00 లక్ష

9. గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు సంబంధించి ఇచ్చిన ఈ ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) వశిష్ట బాబు అని ఆయన్ని పిలుస్తుంటారు

2) 1969లో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి సైకిల్ వెక్టార్ స్పేస్ థియరీపై PHD చేశారు

3) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) లో పనిచేశారు

4) 1971లో భారత్ కి వచ్చాక కాన్పూర్ IIT, కోల్ కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు

10. శబరిమలతో పాటు మసీదుల్లో మహిళల ప్రవేశం, ఇతర అంశాలను కలిపి విచారించేందుకు ఎంతమంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ప్రకటించారు