Tuesday, July 7

14 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (TS)

1. కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్ అథారిటీ , ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా సదస్సులో భాగంగా ఏరోస్పేస్ రంగంలో ఉత్తమ పురస్కారాలను హైదరాబాద్ లో అందజేశారు.  ఏరో స్పేస్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తమ అవార్డు ఏ రాష్ట్రానికి దక్కింది ?

2. దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణీకులకు తగ్గట్టుగా విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచేందుకు 30 కోట్ల డాలర్ల విదేశీ రుణం తీసుకుంటున్నట్టు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ తెలిపారు. ఆయన పేరేంటి ?

3. ఇటీవల ఏ ఇండియన్ పారా మిలటరీ బలగాలకు ఎస్.ఎస్. దేశ్వాల్ డైరక్టర్ జనరల్ (DG) గా నియమితులయ్యారు ?

4. స్టాక్ హోమ్ ఇంటర్నేషన్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసన కొత్త జాబితా ప్రకారం గడచిన ఐదేళ్ళల్లో ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేసిన దేశం ఏది ?

5. 2020 ఆరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈసారి నేషనల్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించనున్నారు ? ( ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారు )

6. ప్రపంచ  ఆరోగ్య సంస్థ ( WHO ) కోవిడ్ 19 ని అంతర్జాతీయ మహమ్మారిగా డిక్లేర్ చేసింది.  ఇంతకుముందు ఏ అంటువ్యాధిని ఇలా డిక్లేర్ చేశారు.

7. కోవిడ్ 19 ( కరోనా వైరస్ ) అనుమానిత కేసులను మూడున్నర గంటల్లో రోగ నిర్ధారణ చేసేందుకు కొత్త పరీక్షా విధానాన్ని ఏ దేశానికి చెందిన సంస్థ రోష్ ప్రకటించింది ?

8. 86 యేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ టైటిల్ ను మొదటిసారి దక్కించుకున్న జట్టు ఏది ?

9. నాలుగు రాష్ట్రాల గుండా 780 కిలో మీటర్ల దూరం నిర్మించే గ్రీన్ హైవేకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  దీనిక కోసం రూ.7660 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి జవదేకర్ తెలిపారు.  ఈ గ్రీన్ హైవే ఈ కింద ఏయే రాష్ట్రాల గుండా వెళ్తుంది ?

10. గ్రీస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి 2020 మార్చి 13న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె పేరేంటి ?

11. కోవిడ్ 19 వైరస్ కోసం కోవిడ్ యాక్షన్ ప్లాట్ ఫామ్ పేరుతో వ్యాపారవేత్తల కమ్యూనిటీని ఏర్పాటు చేసిన సంస్థ ఏది ?

12. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో వార్షిక ఆదాయం తక్కువగా వాటికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.  ఒక్కో పంచాయతీకి 2020-21 సంవత్సరానికి వాటి ఆదాయం ఎన్ని లక్షలకు చేరేలా సాయం చేస్తుంది ?

13. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum ) ఇటీవల విడుదల చేసిన 115 మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ లో మన దేశానికి చెందిన ఎంతమంది పేర్లు ఉన్నాయి ?