Wednesday, October 23

12 OCT CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరుె

12 అక్టోబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ఇక్రిశాట్ వేదికగా బిగ్ డేటా సదస్సును 2019 అక్టోబర్ 16 నుంచి 18 వరకూ నిర్వహించనున్నారు. డిజిటల్ వ్యవసాయంపై నమ్మకం పెంచేలా ట్రస్ట్ హ్యూమన్ మెషిన్స్ పేరుతో ఈ కార్యక్రమం జరగనుంది.  ఇక్రిశాట్ ప్రాంగణం హైదరాబాద్ లో ఎక్కడ ఉంది  ?

2. తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు ఐటీ సంస్థల గురించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?

1) హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న SEZ ల్లో రూ.48.56 కోట్లతో రూ.2,147 కోట్ల ఎగుమతులే లక్ష్యంగా నాలుగు ఐటీ సంస్థలను నెలకొల్పనున్నారు

2) మాదాపూర్, నానక్ రామ్ గూడ, కొండాపూర్, ఉప్పల్ లోని నాలుగు ఐటీ సెజ్ ల్లో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలను నెలకొల్పుతున్నారు

3) చెన్నైకి చెందిన ష్నైడర్ రూ.10.09 కోట్లతో మాదాపూర్ లో 55వేల చ.అడుగులతో నిర్మించనుంది

4) పుణేకి చెందిన ZDF రూ.37.45 కోట్లతో నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేస్తుంది

5) హైదరాబాద్ కు TTEC రూ.21.14 కోట్లు, నాగ్ పూర్ కు చెందిన ఏసెంట్ బిజినెస్ సొల్యూషన్స్ రూ.81 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించనుంది

3. ఆసుపత్రుల్లో సౌకర్యాలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఇన్ ఫెక్షన్ నివారణ, అదనపు అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాయకల్ప అవార్డులకు రాష్ట్రం నుంచి ఎన్ని ఆస్పత్రులు ఎంపికయ్యాయి ?

4. కర్ణాటక సంగీతాన్ని శాక్సా ఫోన్ ద్వారా వినిపించడంలో దిట్ట అయిన ప్రఖ్యాత విద్వాంసుడు కర్ణాటకలోకి మంగళూరులో చనిపోయారు.  ఆయన పేరేంటి ?

5. ) భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఏ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని తమ దేశ అత్యన్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ ను బహుకరించారు ?

6. ఏపీ రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను ప్రభుత్వ సిద్ధం చేస్తోంది.  అయితే ఏ బ్యాంక్ నుంచి రూ.2,500 కోట్లు రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది ?

7. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న ఐదేళ్ళ గడువును ఎంతకు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ?

8. ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు చండీ ప్రసాద్ కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు లభించింది.  మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్మారకార్థం కాంగ్రెస్ పార్టీ దీన్ని నెలకొల్పింది.  ఈ పురస్కారం కింద ఎంత మొత్తం నగదు ఇస్తారు ?

9. పొరుగు దేశం ఎరిట్రియాతో సరిహద్దు ఘర్షణలను నివారించేందుకు చేసిన కృషితో ఇథియోపియో ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన పేరేంటి ?

10. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని నరేంద్రమోడీ బంగాళాఖాతంలోని కోరమండల్ తీరంలో ఉన్న మహాబలిపురంలో (మామల్లాపురం) సమావేశం అయ్యారు.  ఇక్కడి ఏశిలా నిర్మాణాలను ఏ రాజులు నిర్మించారు ?