Tuesday, July 7

12 JAN CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో క్విజ్ ఓపెన్ చేసుకోగలరు

12 జనవరి కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. తెలంగాణలో నడుస్తున్న సఖి (వన్ స్టాప్) కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉండేలా ఇకపై కలెక్టరేట్స్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎన్ని చోట్ల సఖీ కేంద్రాలు ఉన్నాయి ?

2. తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తన పేరుతో పోలైన ఓటు తనది కాదనీ అధికారులను నిలదీసి టెండర్ ఓటు వేసి... తన హక్కును వినియోగించుకున్నందుకు ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం తోషం తండాకు చెందిన ఎవరికి ప్రభుత్వం ప్రజాస్వామ్య పురస్కారం ఇచ్చింది ?

3. సంక్రాంతి సంబురాలను రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకోసం రూ.7.05 కోట్లను కేటాయించింది.  అయితే ఈసారి అధికారికంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలను ఏ జిల్లాలో నిర్వహిస్తున్నారు ?

4. ఆంధ్రప్రదేశ్ లో 2020 జనవరి 26 సందర్భంగా నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలను ఎక్కడ నిర్వహించనున్నారు ?

5. 2020 మార్చిలో అంతర్జాతీయ నేవల్ ఈవెంట్ మిలాన్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?

6. ఆధునిక అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం (1970-2020) పాలించిన రాజు ఖుబాస్ బిన్ సయీద్ (79) క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన ఏ దేశానికి రాజుగా పనిచేశారు ?

7. 21యేళ్ళ లోపు వారు ఫోన్ వాడితో ఏడాది వరకూ జైలు శిక్ష, 70 వేల రూపాయల జరిమానా విధించేలా అమెరికాలోని ఏ రాష్ట్రంలో బిల్లును రూపొందించారు ?

8. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కేంద్రంలో జరిగిన జాతర సందర్భంగా ఖాందేవ్ దర్బార్ జరిగింది.  ఈ వంశీయుల ఆరాధ్య దైవం ఖాందేవ్ కి పూజలు చేశారు ?

9. 2000 సంవత్సరం నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచి 20 ఘటనలను ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుల రేసుకు నామినేట్ చేశారు. ఇందులో భారత్ కు సంబంధించిన క్రీడాంశం ప్రపంచ క్రికెట్ కప్ ను గెలుచుకున్న సందర్భంలో సచిన్ టెండూల్కర్ ని టీమిండియా క్రికెటర్లు తమ భుజాలపై  గ్రౌండ్ అంతా తిప్పారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ?

10. భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ విమానం.  2020 జనవరి 11 నాడు ఏ యుద్ధ విమాన వాహక నౌకపై విజయవంతంగా దిగడం ద్వారా చరిత్ర సృష్టించింది.  (దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతి కొన్ని దేశాల జాబితాలో ఇండియా చేరింది.)