Wednesday, October 23

11 OCT CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

11 అక్టోబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను తగ్గిస్తున్నట్టు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది.  గతంలో జీడీపీ వృద్ధి రేటు 6.2శాతంగా ఉంటుందని సంస్థ అంచనా వేసింది.  ఇప్పుడు ఎంతకు పరిమితం అవుతుందని తెలిపింది ?

2. రైళ్ళల్లో నేరాలపై దేశవ్యాప్తంగా ప్రయాణీకుల ఫిర్యాదులు స్వీకరించేందుకు, వాటి పరిష్కారానికి సాయంగా ఉండేందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దాని పేరేంటి ?

3. ఒలింపిక్స్ పాల్గొనే భారత బృందం బస చేయడానికి ఎక్కడ 2200చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇండియా హౌజ్ ను నిర్మించేందుకు భారత్ ఒలింపిక్ సంఘం, జిందాల్ సౌత్ వెస్ట్ (JSW) ఒప్పందం కుదుర్చుకున్నాయి.

4. వైఎస్పార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారు ?

5. జాతీయ పురుషుల బాక్సంగ్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన మొహ్మద్ హుసాముద్దీన్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?

6. 2019 మార్చి నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది ?

7. 2019 అక్టోబర్ 11 (శుక్రవారం) నాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ సమావేశం అవుతున్నారు ?

8. తెలంగాణలో గ్రామాభివృద్ధి, పారిశుద్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల కోసం అత్యవసరమైన చోట్ల ఖర్చుపెట్టడానికి వీలుగా ప్రతి జిల్లా కలెక్టర్ కు ఎంత మొత్తం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు ?

9. 2007తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో అంధుల సంఖ్య 47శాతం తగ్గినట్టు జాతీయ అంధత్వ దృష్టి లోపాల సర్వే 2019 వెల్లడించింది.  ఏ ఏడాది కల్లా మొత్తం జనాభాలో అంధుల సంఖ్యను 0.3 శాతానికి తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లక్ష్యాన్ని విధించింది ?

10. 2018 ప్రభావశీల రచనలకు సాహిత్య నోబెల్ బహుమతిని ఓల్గా టోకార్ జుక్ గెలుచుకున్నారు. ఈమె ఏ దేశానికి చెందిన రచయిత్రి ?

11. 2019 సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న పీటర్ హేండ్స్ ఏ దేశానికి చెందినవారు ?

12. తెలంగాణలో 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో 29.25 లక్షల మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.  ఎన్ని పనులు పూర్తయ్యాయి ?

13. వాడిపారేసే ప్లాస్టిక్ ను భుజించే బ్యాక్టీరియాను గుర్తించిన పరిశోధకులు ఏ దేశానికి చెందినవారు?

14. పంచాయతీ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎన్ని లక్షల బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

15. ఆంధ్రప్రదేశ్ లో 2020 జనవరి 1 నుంచి ఎన్ని వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు ?

16. ) తెలంగాణ తొలి ఉద్యమకారుడు, TNGO నేత కె.ఆర్.ఆమోస్ చనిపోయారు.  అయితే 1969లో ఆయనకు సంబంధించి ఏ అంశంతో దేశంలోనే తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు ?