Saturday, August 15

11 JAN 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

క్విజ్ ను కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

11 జనవరి 2020 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది.  అండర్ 17 బాలికల మూడు ఈవెంట్స్ లో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది.  ఖేలో ఇండియా పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?

2. 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ కు సేవలు అందించిన మిగ్ – 27 (బహదూర్) యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం ఎక్కడ ఉపసంహరించుకుంది ?

3. జమ్ము కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వారంలోగా సమీక్షించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఇంటర్నెట్ వినియోగం అనేది ఒక ప్రాథమిక హక్కు అని తెలిపింది ?

4. బాల వికాస్ సంస్థ ఆధ్వర్యంలో రూ.35 కోట్లతో 20 ఎకరాల స్థలంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ కేంద్రాన్ని తెలంగాణ మంత్రులు ఏ జిల్లాలో ప్రారంభించారు.

5. అరేబియా సముద్రంలో చైనా, పాకిస్థాన్ లు భారీగా నౌకాదళ విన్యాసాలు చేస్తుండటంతో భారత్ ఏ విమాన వాహక నౌకను ఆ జలాల్లోకి తరలించింది ?

6. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లో మత వివక్ష ఎదుర్కొని భారత్ కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత్ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?

7. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్ రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనా జయసూర్య నియమితులయ్యారు

2) నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది

3) ఈ నలుగురు జడ్జిల నియామకంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుతుంది

4) ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

8. పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) ప్రకారం అక్రమ వలసదారుల జాబితాను రూపొందిస్తున్న మొదటి రాష్ట్రంలో ఏది నిలిచింది ?

9. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతిలో అక్షరాస్యతకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి ?

1) రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీల్లో 2.04 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో 5.7శాతం మందికి చదువు రానట్టు తేలింది

2) 18 యేళ్ళకు పైబడి 11 లక్షల 79 వేల 867 మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు తేలింది

3) పల్లెల్లో నిరక్షరాస్యుల్లో మహిళలే 65శాతం మంది ఉన్నట్టు తేలింది

4) చదువుకోని వాళ్ళల్లో పురుషులు 4,09,083 మంది, మహిళలు 7,70,627 మంది ఉన్నారు

10. ఖతర్ ఓపెన్ ATP 250 టోర్నమెంట్ లో నెదర్లాండ్స్ కి చెందిన వెస్లీ కూలాఫ్ తో కలసి డబుల్స్ లో విజేతగా నిలిచిన భారత టెన్నిస్ ప్లేయర్ ఎవరు ?