Wednesday, December 2

11 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

11 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. 2020 ఫిబ్రవరి 17-19 తేదీల్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ బయో ఏసియా 2020 సదస్సు జరగనుంది.  ఈ సదస్సు ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ దేశంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది ?

2. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మెస్సేజ్ ఈ ఏడాది గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.  దీన్ని 1.17 లక్షల మంది రీ ట్వీట్ చేశారు. ఎన్ని లైకులు వచ్చాయి ?

3. మన దేశానికి చెందిన రీశాట్ 2BR1 తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ఏ వాహనకనౌక ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపుతున్నారు ?

4. ప్రతిష్టాత్మక BWF ప్రపంచ టూర్ బ్యాడ్మింటన్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి ?

5. కేంద్ర హోంశాఖలో సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరు నియమితులయ్యారు ?

6. దేశంలో కృత్రిమ మేథ ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ) కి జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది.  దీన్ని కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కేద్రం, పరిశ్రమలకు భాగస్వామ్యం కల్పించాలని కోరింది.  ఇందుకు ప్రాథమిక పెట్టుబడి ఎంత అవసరమని కమిటీ తేల్చింది ?

7. తెలంగాణలో 2019 డిసెంబర్ 14, 15 తేదీల్లో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు.  దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు, సెలయేర్లను చూసుకుంటూ రక రకాల పక్షి జాతులను గుర్తించడం ఈ ఫెస్టివల్ ఉద్దేశ్యం.  అయితే ఈ కార్యక్రమాన్ని ఏ జిల్లాలోని అడవుల్లో నిర్వహిస్తున్నారు ?

8. ముంబైలో మెట్రోలైన్ 3 కోసం ట్రైన్ సెట్ల తయారీకి పనులను అల్ స్తోమ్ సంస్థ మొదలుపెట్టింది.  ఈ సంస్థ ఏపీలో ఎక్కడ తయారు చేస్తోంది ?

9. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం భూభాగంలో సాగు యోగ్యమైన భూమి ఎంత శాతంగా ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభలో తెలిపారు ?

10. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ప్రతి యేటా దక్షిణ భారత దేశంలో ఎక్కడకి వస్తారు ?