Wednesday, December 2

10 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోడానికి లింక్ : 10 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. రబీకి ఎకరానికి బీమా ప్రీమియంగా రైతులు ఎంత మొత్తం చెల్లించాలి ?

(నోట్: రబీకి రైతు వాటాగా 1.5శాతం, ఖరీఫ్ లో 2.5శాతం చెల్లించాలి )

2. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన పై జాతీయ మానవ హక్కుల సంఘం ( NHRC) కి వస్తున్న ఫిర్యాదుల్లో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా నమోదవుతున్నాయి ? (NHRC 2016-17 నివేదిక)

3. ప్రపంచ మానవాభివృద్ధి సూచీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ( UNDP) నివేదిక 2019 ను 189 దేశాలతో UNO విడుదల చేసింది

2) మొదటి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ నిలిచాయి. అట్టడుగున 189 వ స్థానంలో నైగర్ ఉంది

3) 2005-06 నుంచి 2015-16 వరకూ 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు UNDP వెల్లడించింది

4) భర్త చేతుల్లో హింసకు గురవుతున్న మహిళలు సింగపూర్ లో అతి తక్కువ

5) దక్షిణాసియాలో 31శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురవుతున్నారు

4. హైదరాబాద్ నుంచి కర్నూలు జాతీయ రహదారిపై ఏ ప్రాంతంలో వే సైడ్ మార్కెట్ ( ఆధునిక రైతు మార్కెట్) ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

5. డోపింగ్ ఆరోపణలతో 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ఏ దేశాన్ని నాలుగేళ్ళపాటు నిషేధిస్తున్నట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రకటించింది ?

6. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే అన్ని ఆధారాలు లభ్యమైతే ఎన్ని రోజుల్లోగా మరణశిక్ష పడేలా చట్టాన్ని రూపొందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం తెస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ?

7. 2019 మిన్ యూనివర్స్ విజేతగా నిలిచిన నల్లజాతి మోడల్, హక్కుల కార్యకర్త జొజిబిని తుంజి ఏ దేశానికి చెందిన వారు ?

8. దేశంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో రూ.31,960 కోట్ల సంపదతో అత్యంత ధనికుడిగా మంగళ్ ప్రభాత్ లోథా నిలిచారు. ఆయన రియల్ ఎస్టేట్ సంస్థ పేరేంటి ?

( హురున్ –గ్రోహీ ఇండియా 2019 నివేదిక ప్రకారం)

9. ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ కి ఎన్నో ర్యాంక్ వచ్చింది ? (2018 లో 130 వ స్థానంలో భారత్ ఉంది)

10. డిసెంబర్ 10నాడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.  అలాగే నవంబర్ 25ని మహిళలపై హింసావ్యతిరేక దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.  2019లో 129 దేశాల్లో లింగ సమానత్వంపై విడుదల చేసిన నివేదికలో టాప్ 10 దేశాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి ?