Monday, November 18

08 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసి రాసుకోగలరు.

08 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. అక్షరాస్యత విషయంలో తెలంగాణకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) దేశంలో తెలంగాణ 35వ స్థానంలో ఉంది

2) జాతీయ సగటు 72.99 శాతం, తెలంగాణ సగటు శాతం 66.54 శాతం

3) తెలంగాణలో అక్షరాస్యతలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, వరంగల్ అర్భన్, రంగారెడ్డి, కరీంనగర్

4) తెలంగాణలో అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉన్న ఐదు జిల్లాలు మెడక్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల

2. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన ఏ సంస్థకు ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ICI) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు దక్కింది ?

3. దేశీవాళీ క్రికెట్ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్స్ బెంగళూరులో జరిగాయి. ఈ టోర్నీ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

4. తెలంగాణలో కొత్తగా ఆరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.  కొత్త మంత్రులు – వారి శాఖలను జతపరచండి

1) హరీష్ రావు

2) KTR

3) సబితా ఇంద్రారెడ్డి

4) పువ్వాడ అజయ్

5) గంగుల కమలాకర్

6) సత్యతి రాథోడ్

 

ఎ) విద్యాశాఖ

బి) ఆర్థికశాఖ

సి) రవాణా శాఖ

డి) పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖ

5. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు ?

6. ఉపరితలం నుంచి ఉపరితలానికి 290 కిలోమీటర్ల రేంజ్ లో ఏ క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా ప్రయోగించింది

7. ఆధునిక సెంట్రిఫ్యూజ్ ల అభివృద్ధితో శుద్ది చేసిన యురేనియం నిల్వలను మరింతగా పెంచుకుంటున్నట్టు ప్రకటించిన దేశం ఏది ?

8. తెలంగాణలోని ఏ చారిత్రక కట్టడాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు సెప్టెంబర్ 25న యునెస్కో ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారు ?

9. అసెంబ్లీ చీఫ్ విప్ గా ఎవరిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

10. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విదేశాలకు వెళ్ళే విమానాన్ని తమ గగనతలం నుంచి అనుమతించబోమని పాకిస్థాన్ ప్రకటించింది.  సెప్టెంబర్ 9 నాడు రాష్ట్రపతి ఏయే దేశాల పర్యటనకు వెళ్తున్నారు ?